మనకు రొజువారి జీవితంలో అనేక సంఘటనలలు ఎదురు అవుతూ వుంటాయి.
ఇవన్నీ మనలో వివిధ ఉద్వేగాలను కలిగిస్తాయి.అలా ఉద్వేగాలు కలగడమే కాదు ఇవి మన స్వభావాన్ని నిర్ణయిస్తాయి.
అలా ఉద్వేగం కలిగినప్పుడు ,ఈ ఉద్వేగానికి కారణం బాహ్య సంఘటన అనుకుంటాము.
కాదు.
జరిగిన సంఘటనని మనం ఎలా అర్థం చేసుకున్నాము, ఎలా స్పందించాము,ఎలా అది మనతో సంబంధం కలిగి వున్నది, అన్న అంశాలు ఆధారంగా ఉద్వేగం కలుగు తుంది..
ఒక రకమైన సంఘటన పట్ల అనేక రకాలుగా మనం స్పందించ గలము.
ఏది సరైన స్పందన,ఏది తగు భావోద్వేగం అనేది ఆ సమయంలో మనస్సు యొక్క స్థితి ఎలాంటిది అన్న అంశం ప్రాధాన్యం.
స్వేచ్ఛ గల మనస్సు మాత్రమే తగు స్పందనని, ఉద్వేగాన్ని వ్యక్తం చేయగలదు.
ధ్యానం మనస్సు ని స్వేచ్ఛ గా వుంచుతుంది.
ఇట్లు.
ప్రేమికుడు లేని ప్రేమ.
No comments:
Post a Comment