*🌺🙏జై శ్రీ కుసుమహార🙏🌺*
*_🌴 మానవ జీవితం ఒక నాటక రంగం వంటిది. ఈ నాటక రంగంలో ఎవరు పోషించాల్సిన పాత్ర వారు చక్కగా పోషించి డైరెక్టర్ నుండి మంచి పారితోషికం పొందడానికి ప్రయత్నం చేయాలి. దర్శకుడు ఎలా చెప్తే అలా చేసినపుడే ఆయన నటులను అభినందిస్తాడు. మంచి పారితోషికం ఇస్తాడు. ఇక్కడ భగవంతుడు మనకు దర్శకుడు లాంటివాడు. ఆయన నిర్మిస్తున్న నాటకంలో మనల్ని పాత్రధారులుగా ఎంచుకున్నాడు. కనుక ఎవరి పాత్ర వారు చక్కగా పోషించడానికి ప్రయత్నం చేయాలి. సూత్రధారి సూచించిన సూచనలు పాటించినపుడే పాత్రకు సరైన న్యాయం చేయగలుగుతాం. కనుక ఎక్కడున్నా, ఎలా ఉన్నా దేవుడు చూపిన మార్గంలో నడవడానికే పూన్కోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్గం నుండి తప్పడానికి వీలులేదు. గుర్తుంచుకోండి, దైవము చూపిన దారి తప్పి నడిచామా అంటే, మన నాశనానికి మనమే ముహూర్తం పెట్టుకున్నట్లు అవుతుంది. 🌴_*
No comments:
Post a Comment