కష్టాలు, విఘ్నాలు మనసును బలహీనపరుస్తున్నాయి ! వాటి నుండి ఎలా బయటపడాలి
మనం ఎప్పుడూ విజయాన్నే కోరుకోవడంవల్ల బాధకు లోనవుతున్నాం. కష్టాలు, విఘ్నాలు ఎవరినీ వదలవు.
బాధైనా, కోపమైనా మితంగా ఉండే సందర్భాలున్నాయి.
ఎవరికైనా రోజూ కష్టాలే ఉండవు. కాకపోతే వాటినే ఎక్కువగా గుర్తుంచుకొని స్మరిస్తుండటంచేత అలా భావిస్తుంటాం. మనకి లభించిన సంతోషాలను గుర్తుంచుకోవటంలేదు. లేదా అత్యాశ వల్ల పట్టించుకోవటంలేదు.
మన విధానం ఎలా ఉండాలో తెలియజెప్పటమే
అవతార పురుషుల అంతర్యం.
శ్రీరాముడు, హనుమంతుడు కూడా
సీతాదేవి విషయంలో బాధను అనుభవించారు.
ఆమె కనిపించలేదని హనుమంతుడు చనిపోవాలని అనుకున్నాడు.
కష్టాలు, విఘ్నాలను తట్టుకోవటంలోనే మన మనోనిగ్రహం తెలుస్తుంది.
శ్రీరాముడు, సీతాదేవి కోసం దుఃఖించాడే తప్ప
అలాగే చింతిస్తూ కూర్చుండి పోలేదు.
అంత బాధలోనూ తన కర్తవ్యాన్ని విస్మరించనంతధీరత్వంతో ఉన్నాడు.
విజయం కోసం వెంపర్లాడలేదు.
కేవలం ధర్మంగా తన పని తాను చేస్తూ వెళ్ళాడు.
అదే మనకు సద్బోధ !
అందుకే మనం వదలాల్సింది..కర్తవ్యాన్ని కాదు..
మన కర్మలను వదులుతూ..జీవనగమనాన్ని సాగించాలి
No comments:
Post a Comment