జీవితంలో ఒదిగి ఉండగలిగిన వారే త్వరగా ఎదుగుతారు,
పరిస్థితులు ఎంతగా అణచి వేసినా అంతిమ విజయం వారిదే,
కొన్ని కష్టాలు అనుభవాలను ఇచ్చి మనిషిని శక్తివంతుడిగా మారుస్తాయి,
ఒదిగి ఉండటం చిన్నతనం కాదు, రేపటి విజయానికి తొలిమెట్టు...
నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పనవసరంలేదు,
నిన్ను ఇష్టపడని వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పిన అర్థం కాదు,
మనం మంచి వాళ్లుగా జీవిస్తే చాలు,
దానిని నిరూపించుకోవాలని ప్రయత్నించనవసరం లేదు,
విలువ లేని వారితో వాదించటం,వాళ్ళ మాటలకి స్పందించటం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది...
కష్టాలు గాని సుఖాలు గాని గడిచిన కొద్దీ అలవాట్లు గా మారిపోతాయి,
తరువాత వాటిని గురించి ఆలోచించడానికి కూడా ఏమీ ఉండదు..
అసూయ ద్వేషాలు మానసిక రోగాలు,మనిషి ఎదుగుదలను అవి అడ్డంకులు ,
సంతోషం,సహనం, శాంతం అనే మూడు గుణాలు ఎదుగుదలకు ఉపయోగపడతాయి...
భయమనేది ఓటమికి చిరునామా , పట్టుదల అనేది విజయానికి చిరునామా. భయపడినవాడిని విజయం వరించదు, పట్టుదల ఉన్నవాడ్ని ఓటమి భయపెట్టదు. ఈ ప్రపంచంలో మనదగ్గర లేకపోయినా ఎంతమందికైనా పంచగలిగినది సంతోషం ఒక్కటే...🙏🙏
🌻 మహానీయుని మాట🍁
-------------------------
"అడవుల్లో తిరిగినా రాముడు చెడిపోలేదు.
అంతఃపురంలో పెరిగినా రావణుడు బాగుపడలేదు.
వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో,అంతస్తులోనో ఉండదు.
ఆలోచనల్లో,ఆచరణలో మాత్రమే ఉంటుంది."
--------------------------
🌹 నేటీ మంచి మాట 🌼
---------------------------
"మనల్ని మనం మరచి కార్యసాధనలో నిమగ్నమైన ప్రతిసారీ తెలియని నూతన ఉత్సాహాన్ని పొందగలము."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻FORWARDED
No comments:
Post a Comment