*🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌹🧘♂️మనోమందిరం🧘♀️*
*మానవ శరీరమే ధర్మక్షేత్రం. ఆ క్షేత్రానికి చైతన్యాన్ని, జాగృతిని కలిగించేది మనసు. ఇహపర సాధనలకు, ఆధ్యాత్మిక ఉన్నతికి, మన చర్యలకు, వాటి ఫలితాలకు- మనసే కేంద్ర బిందువు. పంచ జ్ఞానేంద్రియాల్ని, పంచ కర్మేంద్రియాల్ని మనసే నియంత్రిస్తుంది. ఆ మనసే అంతఃకరణం. ఈ అంతఃకరణం ఎంత పరిశుద్ధంగా ఉంటే మన జీవనం అంత సుసంపన్నంగా ఉంటుంది. మన శరీరంలో అరిషడ్వర్గాలు, చంచలమైన మనసుతో సమ్మిళితమై ఉన్నాయి. ఏదైనా విషయాన్ని సంకల్పిస్తే అది మనసు. అదే విషయాన్ని ఆలోచిస్తే అది చిత్తం. ఆ విషయాన్నే నిశ్చయిస్తే అది బుద్ధి. ధర్మమార్గంలో చరించాలని నిశ్చయాత్మకమైన బుద్ధి హెచ్చరిస్తున్నా- చివరకు చంచలమైన మనసు మాటే వింటున్నాం. అనేక రీతుల్లో ఇబ్బందులు పడుతున్నాము. మన మనసులోని యోచనలన్నింటినీ పంచేంద్రియాలు ఆచరణలో పెడతాయి. వివేచనా శక్తి, విచక్షణా యుక్తితో వ్యవహరించడం ద్వారా మనసు నియంత్రణలో ఉంటుంది.*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment