ప్రతిఫలం ఆశించకూడదు..
🔹🔸🔹🔸🔹
ఒక పెద్ద ఆటస్థలం అక్కడ ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు అటుగా వెళ్తూ ఒక ముని వారిని వారి ఆటను చూస్తూ వారి ఆనందాన్ని ఈయన అనుభవిస్తూ నిలుచుండిపోయారు
కాసేపు తరువాత ఆ పిల్లల్ని పిలిచారు
పిల్లలు వచ్చారు ఈయన వేషధారణ వారికి వింతగానూ కాస్త నవ్వును తెప్పించాయి
పిల్లలు మీరు రోజు ఇలా ఆడుకుంటూ ఉంటారా అని అడిగారు
అవును అయ్యా అన్నారు పిల్లలు
ఒక పిల్లాడితో ఇలా ఆదుకోవడం వల్ల లాభం ఏంటని అడిగ్గారు స్వామి
ఆ పిల్లాడు ఆడుకోవడం వల్ల నేను ధృడంగా తయారవుతాను శక్తివంతుడిని అవుతాను అప్పుఫు అప్పుడు నేను ఎవర్నీ చూసి భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు
ఆ పిల్లాడి జవాబుకి సంతోషించి
భవిష్యత్తులో నీవు పెద్ద మల్లయుద్ధ వీరుడివి అవుతావు అని ఆశీర్వదించారు
అదే ప్రశ్న మరొక కుర్రాడిని అడగగా
కాసేపు ఆడుకున్నాక మనసు విశ్రాంతి పొందుతుంది కాళ్ళు చేతులు కడుగుకుని పుస్తకం పడితే బాగా చదువు బుర్రకెక్కుతుంది అన్నాడు
ఆ పిల్లాడి జవాబుకి సంతోషించి
భవిష్యత్తులో నీవు చదువులో ఉన్నత స్థానాన్ని అందుకుంటావని ఆశీర్వదించారు
అదే ప్రశ్న చివరి కుర్రాడిని అడగగా
నాకు ఆటలంటే ఇష్టం అందుకే ఆడుకుంటున్న అన్నాడు
అతడి జవాబుకి ఆశ్చర్య పోయిన స్వామి
అతనికి నమస్కరించి ఇక పై నీవే నా గురువువి అన్నాడు
మనిషి ఏదైనా చేసేప్పుడు ప్రతిఫలం ఆశించకుండా చేస్తేనే పూర్తి సంపన్నుడు అవుతాడు
చేసే ప్రతిపనిలోను ప్రతిఫలం ఆశించి చేస్తే నమ్మి అందనపుడు మోసపోయి నిరాశపడుతాడు
ఆనందాన్ని పోగొట్టుకుంటాడు అని చెప్పాడు
🙏 జై శ్రీమన్నారాయణ🙏🏻
🔹🔸🔹🔸🔹🔸🔹
సేకరణ
No comments:
Post a Comment