Monday, August 15, 2022

ధ్యానం, కలలకు మధ్య ఉన్న బంధం ఏమిటి? మన కలలను విశ్లేషించాలా లేక వదిలి వెయ్యాలా?

 🔺 పత్రీజీ సమాధానాలు🔺
🌹 చాప్టర్ --8:--- ధ్యాన అనుభవాలు 🌹

🍁 ప్రశ్న :--- ధ్యానం, కలలకు మధ్య ఉన్న బంధం ఏమిటి? మన కలలను విశ్లేషించాలా లేక వదిలి వెయ్యాలా?

🍀 పత్రీజీ :--- ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కలనూ విశ్లేషించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ధ్యాన అనుభవాన్ని విశ్లేషించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ జీవిత అనుభవాన్నీ విశ్లేషించకూడదు. మనం ఇక్కడ దేన్నీ విశ్లేషించటానికి లేము. ప్రతి అనుభవాన్ని ఎదుర్కుంటూ, సాక్షిగా ఉండటానికే ఉన్నాం. అంతే.

🌿 "దేవదూతలు నడవటానికి భయపడే చోట మూర్ఖులు పురు" అనే గొప్ప వాక్యాన్ని ఎప్పటికీ గుర్తు ఉంచుకోండి.

🌸 మనం పొందవలసిన జ్ఞానం, విజ్ఞానం అంతా కూడా సాక్షిగా గమనిస్తూ ఉండటం ద్వారా పొందుతామే కానీ విశ్లేషణలు, మేధో మథనాల ద్వారా కాదు. విశ్లేషణ మనల్ని కొంచెం కూడా ముందుకు తీసుకువెళ్ళదు. మన మనస్సు యొక్క డేటాబేస్ చాలా చిన్నది కనుక మనం విశ్లేషణ చెయ్యటానికి అసమర్థులం.

🌳 పూర్తి సమాచారం లేకుండా మనం దేన్నీ, ఎప్పుడూ విశ్లేషణ చెయ్యటానికి ప్రయత్నించకూడదు. మరి పూర్తి సమాచారం కలిగి ఉండటం ఏ మానవమాత్రుడికి సాధ్యం కాదు. కనుక ఏ కలనూ మంచిది.. లేదా చెడ్డది అని ఎవరి జీవితాన్ని మంచిది... లేదా చెడ్డది అని విశ్లేషించ వద్దు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌷 పత్రీజీ సమాధానాలు పుస్తకం మరియు ఇతర పత్రీజీ పుస్తకాల సెట్ కావాల్సిన వాళ్ళు 9032596493 కి what's app msg చేయగలరు.

👍 VicTorY oF LiGhT🎇

💚🔆 Light Workers---- 🔄♻🔁 Connected with Universe💓🌟🌕✨💥☣

సేకరణ 

No comments:

Post a Comment