Thursday, August 18, 2022

అగస్త్య మహర్షి చరిత్ర ..!!


మన మహర్షల చరిత్ర..

🙏🙏🙏🙏

🌹అగస్త్య మహర్షి చరిత్ర ..!!🌹
🙏🙏🙏🙏

🌸 భారతావనిలో అనితర సాధ్యమైన మహత్కార్యాలు చేసిన మహాత్ముడు అగస్త్య మహర్షి.

🌸 అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప ఋషి. దక్షిణ భారతదేశంలో నేటికీ ఈ ఋషి జీవించే ఉన్నట్టుగా చెప్తారు.

🌸 అగస్త్యుడు ఇప్పటికి నర్మదానదీ తీర ప్రాంతం గరుడేశ్వర్, గుజరాత్ వద్ద తపస్సు ఆచరిస్తునారని అక్కడి ప్రజల నమ్మకం.

🌸 భారతీయ సంప్రదాయం ప్రకారం అగస్త్యుడు చాలా భారతీయ భాషల్లో గొప్ప పండితుడు. ఋగ్వేదంలో 1.165వ శ్లోకం నుంచీ 1.191వ శ్లోకం వరకూ అగస్త్య మహర్షి,

🌸 అతని భార్య లోపాముద్రలు రాసినవేనని పురాణ కథనం. ఋగ్వేదమే కాక, ఇతర వైదిక సాహిత్యం కూడా వారు రాశారు.

🌸 అగస్త్యుడు ఎన్నో ఇతిహాసాలు, పురాణాలలో కనిపిస్తాడు.
ముఖ్యంగా రామాయణ, మహాభారతాలలో అతని ప్రస్తావన ఉంది.అగస్త్యుడు సప్తర్షులలో కూడా ఒకడు.

🌸 తమిళ శైవ సాహిత్యంలో అగస్త్యుని శైవ సిద్ధునిగా వర్ణించారు.
శాక్తేయం, వైష్ణవాలకు చెందిన పురాణాలలోనూ అగస్త్యుని ప్రస్తావన వస్తుంది.

🌷అగస్త్యుని జన్మ :🌷
🙏🙏🙏🙏
🌸 అగస్త్యుని మూలాలు పౌరాణికమైనవి. మిగిలిన ఋషులులాగా అగస్త్యుడు తల్లీ, తండ్రులకు పుట్టలేదు.

🌸 వరుణుడు, మిత్రుడు యజ్ఞం చేస్తుండగా, ఊర్వశి ప్రత్యక్షమవుతుంది.
ఆమెను చూసి మోహం పొందిన వారిద్దరి వీర్యాలు అక్కడే ఉన్న ఒక కుండలో పడ్డాయి.

🌸 ఆ కుండ గర్భస్థానం. ఈ కుండలోనే ఆగస్త్యుడు, తన కవల అయిన వశిష్ఠునితో కలసి పెరుగుతాడు.

🌸 అలా అగస్త్యునికి కుంభయోని అనే పేరు వచ్చింది. కుంభయోని అంటే కుండలో నుంచి పుట్టినవాడు అని అర్ధం.

🌸 అగస్త్యుణ్ణికి కుంభజ, కుంభయోని, మైత్రావరుణి ,కలశజుడు, కుంభసంభవుడు , ఔర్వశేయుడు , మిత్రావరణ పుత్రుడు , వహ్నిమారుత సంభవుడు అని ఇంకా అనేక పేర్లున్నాయి .

🌸 అగస్త్య మహర్షికి చిన్నతనంలో ఉపనయనం , ప్రణవ పంచాక్షరీ మంత్రోపదేశం అన్నీ దేవతలే చేసేశారు .

🌷అగస్త్య మహర్షి వివాహం :🌷
🙏🙏🙏🙏
🌸 మనుస్మృతి ప్రకారం అందరు హిందువుల లాగే అగస్త్యుడు కూడా వివాహం చేసుకుని సంతానం కనాల్సి వచ్చింది.

🌸 అప్పుడు అతను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అతను యోగశక్తిని ఉపయోగించి గుణగణాల్లోనూ, వ్యక్తిత్వంలోనూ అన్నిరకాలుగా,

🌸 ఒక విరాగికి భార్యగా ఉండేందుకు అవసరమైన లక్షణాలు కలిగిన ఒక ఆడశిశువును సృష్టించాడు.

🌸 తన తపోబలంతో పుత్రకాముడనే పేరున్న విదర్భరాజుకి ఒక చక్కటి కుమార్తె పుట్టాలని వరం ఇచ్చాడు .

🌸 ఆ అమ్మాయి పేరే లోపాముద్ర .
ఆమెకు యుక్త వయస్సు రాగానే అగస్త్యుడు ఆమెను వివాహం చేసుకున్నారు.

🌸 ఒకసారి బ్రహ్మదేవుడు అగస్త్యుల వారితో నీ భార్య లోపాముద్ర విష్ణుమాయ అంశాన పుట్టింది .

🌸 ఇప్పుడు విష్ణుమాయ కవేరరాజుకి ముక్తి నివ్వడానికి ఆయన కుమార్తెగా పుట్టి ఘోరతపస్సు చేస్తోంది . ఆమెను
పెళ్ళి చేసుకో అన్నాడు బ్రహ్మదేవుడు . అగస్త్యుడు బ్రహ్మదేవా ! నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను అని చెప్పి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు .

🌸 పెళ్ళి అవగానే కవేరకన్య కావేరీ నదిగా ప్రవహించింది . కావేరి నదిలో స్నానం చేసిన కవేరరాజుకి ముక్తి కలిగింది .

🌸 అగస్త్యుడు భార్యతో కలసి యాత్రలు చేస్తూ గోదావరీ తీరంలో ఉన్న పంపాసరోవరం , దండకారణ్యం , గోదావరీ తీరం , కోటిపల్లి , పలివెల , భీమేశ్వరం ,

🌸 ద్రాక్షారామం , వీరభద్రశిఖరం మెదలయినవి చూసి కొల్లాపురం చేరి అక్కడ లక్ష్మీదేవికి స్తోత్రం చేశాడు .

🌸 లక్ష్మీదేవి అగస్త్యుణ్ణి ద్వాపర యుగంలో వేదవ్యాసుడవై పుట్టి వారణాశిలో నిరంతరం ఉంటావని దీవిస్తుంది ....
🙏🙏🙏🙏

సేకరణ

No comments:

Post a Comment