అర్ధం కాలేదు - అర్ధం అయ్యింది - శరణాగతి
* * *
అర్ధం కాలేదు...అంటే,
అర్ధం(సగం) అయ్యిందనే కదా...!
అది చాలు...
* * *
ఒక సగం వాగ్రూపంగా ఉంటుంది...
మిగతా సగం అనుభవరూపంగా ఉంటుంది...
వాగ్రూపం(వ్యక్తం) - పార్వతి.
అనుభవం(అవ్యక్తం) - శివుడు.
ఇదే అర్ధనారీశ్వరతత్త్వం.
* * *
అర్ధం కాలేదు...అనే స్థితి నుండి...
అర్ధం అయ్యింది...అనే స్థితికి ఎదగడం విజ్ఞానం.
* * *
అర్ధం అయ్యింది...అనే స్థితి నుంచి...
అర్ధం కాలేదు...అనే స్థితికి ఎదగడం జ్ఞానం.
* * *
తెలియనితనం అనేది అజ్ఞానం కాదు.
అదే శుద్ధజ్ఞానం...
అక్కడ తెలియడానికి ఏమీ ఉండదు...
తనకు అన్యం లేక.
* * *
ఆ శుద్ధ తెలియనితనమే-
శిశుత్వం...
ఋషిత్వం...
దైవత్వం...
* * *
ప్ర: మనసంతా ఖాళీగా ఐపోతున్నది...
జ): ఖాళీ అవ్వాలనే కదా అందరూ సాధనలు చేస్తుండేది....
ప్ర: ఏ విషయం పట్లా ఆసక్తి కలగడం లేదు.
ప్రపంచవిషయాలేవీ ఉత్సాహమివ్వడం లేదు.
స్తబ్దుగా ఉంది.
జ): ఆసక్తి లేకపోవడం
ఉత్సాహం లేకపోవడం
ఆధ్యాత్మిక లక్షణాలే.
స్తబ్దత అనేది కూడా అవలక్షణమేమీ కాదు.
ఇవన్నీ మంచి లక్షణాలే.
భగవంతుని వైపుకే మీ అడుగులు పడుతున్నాయి...
ఏ విచారమైనా ఆత్మవిచారంలో అంతర్భాగమే.
ప్ర: నన్నిప్పుడు ఎలా ఉండమంటారు...?
జ):
ఏ పరిస్థితికా పరిస్థితి....
ఏ క్షణానికాక్షణం...
ఎలా ఉంటే అలా ఉండండి. (అంటే నిశ్చలమైన ఆకాశాన్ని, చలించే త్రిగుణాలను ఒకేసారి రెండింటిని కలిపి అనుభవించండి.)
ఉన్నదాన్ని ఉన్నట్టు అనుభవించడం తప్ప , అలా ఉండడం ఇలా ఉండడం అనేది మన చేతుల్లో ఏమీ లేదు కదా.
ఈ ఒక్క విషయం జ్ఞప్తిలో ఉండడమే శరణాగతి.
* * *
అర్ధం కాలేదు...అంటే,
అర్ధం(సగం) అయ్యిందనే కదా...!
అది చాలు...
* * *
ఒక సగం వాగ్రూపంగా ఉంటుంది...
మిగతా సగం అనుభవరూపంగా ఉంటుంది...
వాగ్రూపం(వ్యక్తం) - పార్వతి.
అనుభవం(అవ్యక్తం) - శివుడు.
ఇదే అర్ధనారీశ్వరతత్త్వం.
* * *
అర్ధం కాలేదు...అనే స్థితి నుండి...
అర్ధం అయ్యింది...అనే స్థితికి ఎదగడం విజ్ఞానం.
* * *
అర్ధం అయ్యింది...అనే స్థితి నుంచి...
అర్ధం కాలేదు...అనే స్థితికి ఎదగడం జ్ఞానం.
* * *
తెలియనితనం అనేది అజ్ఞానం కాదు.
అదే శుద్ధజ్ఞానం...
అక్కడ తెలియడానికి ఏమీ ఉండదు...
తనకు అన్యం లేక.
* * *
ఆ శుద్ధ తెలియనితనమే-
శిశుత్వం...
ఋషిత్వం...
దైవత్వం...
* * *
ప్ర: మనసంతా ఖాళీగా ఐపోతున్నది...
జ): ఖాళీ అవ్వాలనే కదా అందరూ సాధనలు చేస్తుండేది....
ప్ర: ఏ విషయం పట్లా ఆసక్తి కలగడం లేదు.
ప్రపంచవిషయాలేవీ ఉత్సాహమివ్వడం లేదు.
స్తబ్దుగా ఉంది.
జ): ఆసక్తి లేకపోవడం
ఉత్సాహం లేకపోవడం
ఆధ్యాత్మిక లక్షణాలే.
స్తబ్దత అనేది కూడా అవలక్షణమేమీ కాదు.
ఇవన్నీ మంచి లక్షణాలే.
భగవంతుని వైపుకే మీ అడుగులు పడుతున్నాయి...
ఏ విచారమైనా ఆత్మవిచారంలో అంతర్భాగమే.
ప్ర: నన్నిప్పుడు ఎలా ఉండమంటారు...?
జ):
ఏ పరిస్థితికా పరిస్థితి....
ఏ క్షణానికాక్షణం...
ఎలా ఉంటే అలా ఉండండి. (అంటే నిశ్చలమైన ఆకాశాన్ని, చలించే త్రిగుణాలను ఒకేసారి రెండింటిని కలిపి అనుభవించండి.)
ఉన్నదాన్ని ఉన్నట్టు అనుభవించడం తప్ప , అలా ఉండడం ఇలా ఉండడం అనేది మన చేతుల్లో ఏమీ లేదు కదా.
ఈ ఒక్క విషయం జ్ఞప్తిలో ఉండడమే శరణాగతి.
No comments:
Post a Comment