వివేకానంద బోధలు :
1. ఎటువంటి ఇబ్బందికరమైన సందర్భమైనా సద్భావన దిశగా మళ్లించాలి. సున్నితమైన విషయాన్ని కూడా నొప్పించకుండా ఎదుటివారికి, మనకు ఉండేటట్టు మన సమర్థతను, మేధస్సును వాడాలి. దానికి స్థితప్రజ్ఞత కావాలి.
2. జీవితాన్ని పరాజయాల నుంచి విజయాల వైపు మళ్లించాలంటే దేవుడిచ్చిన వివేకాన్ని వాడాలి. అప్పుడు మనకు ఉద్రేకం గానీ, ఉద్వేగం గానీ కలగకూడదు.
3. ఆలోచనా శక్తి లేని పెద్ద యంత్రం కంటే ఆలోచనా శక్తి గల చిన్న పురుగు గొప్పది. ఆ పురుగు కన్నా ఎక్కువ రెట్లు బుద్ధి మానవునికి ఉంది. దాంతో మానవుడు అర్థవంతంగా జీవిస్తూ, పరిస్థితుల అవగాహన కోసం మనసును ఉపయోగిస్తే జీవితం సార్థకమౌతుంది.
3. ప్రపంచం ప్రతి విషయంలోనూ మనల్ని రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తుంది. అలాంటి పరిస్థితిలో మనముందు రెండు మార్గాలు కనపడతాయి; కోపం, ద్వేషం, అసూయలకు గురై వాస్తవస్థితిని గుర్తించలేక పోవడం, ఓర్పుతోసహిస్తూ సమయం శక్తి వృధా కాకుండా చేసుకోవడం.
4. మన శక్తి సామర్ధ్యాలు ఎప్పుడూ జ్ఞానం నుంచే రావాలి. అప్పుడే సమస్యలు సులభంగా పరిష్కరించుకోగలం. ఇక్కడ సమస్య తీవ్రతను కాకుండా పరిష్కారానికి అవలంబించే పద్ధతే ముఖ్యం.
- మంత్రవాది మహేశ్వర్ ( శ్రీ పీఠం చైత్రం, ఏప్రిల్ 2016 సంచికలో )
No comments:
Post a Comment