Sunday, September 25, 2022

మంచి మాట.. లు(23-09-2022)

23:09:2022:-శుక్రవారం
ఈ రోజు AVB మంచి మాట.. లు
చూడు మిత్రమా!!
మనిషి జీవితంలో, ఆపదలకు మూలం అజాగ్రత్త, పతనానికి మూలం అహంకారం,,

జీవితంలో ఒకటి గుర్తుంచుకో,, మనం చేసిన మంచిని మరుక్షణమే మరిచిపోవాలి, మనకు మంచి చేసిన వారిని మరణించే క్షణం వరకూ గుర్తుంచుకోవాలి,,

కాకులతో కలిసి తిరిగితే పావురం రూపు మారకపోవచ్చు కానీ బుద్ధి మారుతుంది,, అందుకే దుష్టులతో స్నేహం మంచిది కాదు,,

ఒకరు బాగుపడితే చూడలేని వాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు, ఇది సత్యం,,

మనసు చెడు ఆలోచనలతో నిండిపోయినప్పుడు, మంచి చెప్పేవారు శత్రువులు గాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు,,
సేకరణ ✍️AVB సుబ్బారావు 🤝

No comments:

Post a Comment