Monday, September 12, 2022

మంచి.. మాటలు(28-08-2022)

🔱శుభోదయం🙏
28-08-2022:- ఆదివారం
ఈ రోజు AVB మంచి.. మాటలు

చూడు మిత్రమా!!

అహం ఎక్కడైతే ప్రారంభమౌతుందో, పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది, అందుకే పదవి, పలుకుబడి చూసుకొని అహంకారంతో విర్రవీగకూడదు,,

తొక్కి బతుకుతాను అనే వాళ్లముందు, ఎదిగి నిలబడతాను అనే ధైర్యం ప్రతిఒక్కరికి ఉండాలి,,ఆలా ఉండగలిగేవాడే విజయం సాధిస్తారు

రక్తం చుక్కలు చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం "మాట" దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు, తెలివైనవాడు ఆలోచించి మాట్లాడతాడు,,

రాజు గారి కుక్క చనిపోతే ఊరు జనం అందరూ చూడడానికి వచ్చారంట, కానీ ఒకనాడు ఆ రాజే చనిపోతే ఎవ్వరు రాలేదంట, అంటే కుక్క చనిపోయినప్పుడు రాజు ఏమైనా అనుకుంటాడు అని జనాలు వచ్చారు, కానీ ఆ రాజే పోయాక ఇక మనల్ని ఎవడు అంటాడు అని భరోసాతో జనాలు ఎవరు రాలేదు, అందుకే మనుషులు ఉన్నంత వరకే అతి వినయాలు, నమస్కారాలు(అందరు కాదు )కొందరికే వర్తిస్తాయి ,,

"ఇగో" అడ్డు రాకపోతే ఈ భూమిమీద బతకడానికి సవాలక్ష మార్గాలున్నాయి, గుర్తుంచుకో మిత్రమా ఎగిసిన అల, మిడిసిపడిన తల, నిటారుగా పెరిగిన చెట్టు ఏ నాటికైనా విరగక తప్పదు,,
సేకరణ
✍️AVB సుబ్బారావు

No comments:

Post a Comment