Monday, September 12, 2022

మంచి మాట..లు(29-08-2022)

సోమవారం --: 29-08-2022 :--
ఈ రోజు AVB మంచి మాట..లు
జీవితం చాలా చిన్నది ఎవరినోద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు,వీలైనంత వరకు నలుగురితో సంతోషంగా గడుపు,

చిన్నపుడు దేన్నయిన పట్టుకుని నిలబడాలి పెద్దయ్యాక దేన్నయినా తట్టుకుని నిలబడాలి

మంచితనం అనే ముసుగులో గొంతు కోసే వాళ్లు ఉంటారు వెంటే ఉంటూ గోతులు తీసే వాళ్ళు ఉంటారు
పొరపాటున కూడా అతిగా ఎవరిని నమ్మకండి ఎందుకంటే మనషులనే చూస్తాం కానీ వాళ్ళ మనసులో ఏముందో చూడలేము కదా !

గొప్ప గొప్ప వాళ్ళని చూసి నిన్ను నువ్వు తక్కువగా భావించకు, నీకంటూ ఒకరోజు ఉంటుంది ఆ రోజు కోసం ఓపికతో ఆగి చూడు, అపుడు నీ స్థానం కూడా గొప్పదే అవుతుంది,అప్పటి వరకు నీ ఆత్మస్తైర్యాన్ని బలంగా నమ్మి బతికితే చాలు,

నీ చుట్టూ ఉన్నవాళ్ల స్థాయి స్థానం మారితే నిన్ను మర్చిపొతారు,,అదే నిజం కూడా,అయినా నువ్వు నీలా ఉండాలి,స్థానం మారినా మారక పోయినా అదే వ్యక్తిత్వం .

జీవితం నీది,గమ్యం నీది,స్వప్నం నీది, కష్టం శ్రమ గెలుపు ఓటమి అన్ని నీవే,పడితే లేవాల్సింది నీవే, బాధ దిగమింగాల్సింది నీవే, గాయాన్ని దిగమించాల్సింది నీవే, దైర్యం చెప్పుకోవాల్సింది నీవే, ఇతరులు కేవలం చోద్యం చూస్తారు,, అవకాశం దొరికితే ఎగతాళి చేస్తారు కాబట్టి,, ఎవరిని పట్టించుకోవద్దు అన్ని గమనిస్తూ ముందుకు సాగిపో నేస్తమా
సేకరణ ✍️AVB సుబ్బారావు

No comments:

Post a Comment