010922d1935. 020922-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀67.
ఓం నమో భగవతే రామకృష్ణాయ
స్వామి వివేకానంద జీవిత గాథ:-67
➖➖➖✍️
*ఆధ్యాత్మిక సాధనలు తీవ్రమయ్యే కొద్దీ కొన్ని అతీంద్రియ అనుభవాలను తప్పించుకోలేము. కలలో వచ్చే అనుభవాలు, జాగ్రదావస్థలl జరిగే సంఘటనలు మొదలైనవి ఈ కోవకు చెందుతాయి. వీటిని అర్థం చేసుకోవడానికి, సరియైన రీతిలో స్వీకరించడానికి ఒక ఉత్తమ గురువు మార్గదర్శకత్వం ఎంతో అవసరం*.
నరేంద్రుని కొన్ని అనుభవాలను పరికిద్దాం. ఈ రోజుల్లో రూపంలో తన లాంటి తన 'కవల'ను నరేంద్రుడు చూడసాగాడు. అతడు అచ్చం నరేంద్రుడే! అద్దంలో కనిపించే ప్రతిబింబం చేసే విధంగా, నరేంద్రుడు చేసేదంతా ఆ 'కవల' కూడా చేసేవాడు. కొన్ని సమయాల్లో ఒక గంటసేపటి దాకా ఆ 'కవల' ఉండేవాడు. ఈ విషయాన్ని నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు తెలియజేశాడు. కాని ఆయన ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు; *అత్యున్నత ధ్యాన స్థితులలో ఇటువంటి అనుభవాలు సాధారణంగా కలుగుతూ ఉంటాయని* మాత్రం ఆయన చెప్పారు. '
మరొక అనుభవం: ఒక రోజు రాత్రి నరేంద్రుడు తన మిత్రుడైన శరత్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో అడుగు పెట్టీ పెట్టగానే శిలాప్రతిమలా నిలబడిపోయాడు. అందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు, *"ఈ ఇంటిని ఇంతకు మునుపు నేను ఎప్పుడో చూసివున్నాను! ఎటుగుండా ఎటు వెళ్లాలో, ఏ గది ఎక్కడ ఉందో నాకు బాగా పరిచయమైనట్లు తోస్తున్నది, ఏం ఆశ్చర్యం!" అన్నాడు. తమాషా ఏమిటంటే నరేంద్రుడు ఆ ఇంట్లోకి అడుగుపెట్టడం అదే మొట్టమొదటిసారి*. దీనిని గురించి కాలాంతరంలో అతడు ఇలా చెప్పాడు:✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
No comments:
Post a Comment