Tuesday, September 6, 2022

స్వామి వివేకానంద జీవిత గాథ:-69 ( సుదూరంలో జరిగేవి చూసే, వినే శక్తీ నరేంద్రునికి అలవడింది.)

 030922d2157.    040922-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀69. 
ఓం నమో భగవతే రామకృష్ణాయ

స్వామి వివేకానంద జీవిత గాథ:-69
                ➖➖➖✍️

సుదూరంలో జరిగేవి చూసే, వినే శక్తీ నరేంద్రునికి అలవడింది. ఒక రోజు అతడు ధ్యానానికి కూర్చున్నాడు. ధ్యానంలో ఒకింత మగ్నుడవగానే అతడి మనస్సు ఉన్నత స్థితిని అధిరోహించింది; ఒక ఫలానా వ్యక్తి, ఫలానా ఇంట్లో కూర్చుని, ఒక ఫలానా విషయం గురించి మాట్లాడుతూవుండడం అతడు చూడ గలిగాడు! ఈ విధంగా చూడగానే ఆ దృశ్యం నిజమా కాదా అనే కుతూహలం అతడిలో తలెత్తింది. 

వెంటనే లేచి తను చూసిన ఆ చోటుకు వెళ్లాడు. 
అతడు ధ్యానంలో చూసిందంతా యథార్థమే, పిసరంత కూడా మార్పులేదు. కొన్నిరోజులు గడిచాక అతడు ఈ విషయం గురుదేవులకు తెలియజేశాడు. అందుకు శ్రీరామకృష్ణులు, *"ఇవి భగవదనుభూతి పొందే మార్గంలోని ఆటంకాలు*. కొన్ని రోజులు ధ్యానం చేయబోకు" అని చెప్పారు.

మరొక అతీంద్రియశక్తీ నరేంద్రునిలో పెంపొందసాగింది. ఎవరైనా వ్రాసిన కాగితపు ముక్కలను తన చేతిలో ఉంచుకొంటే చాలు, అది వ్రాసిన వ్యక్తిని గురించి అన్ని విషయాలు అతడికి తెలిసిపోయేవి. ఆ వ్యక్తి ఆకారం, అతడు ఏ దుస్తులు ధరించాడు. అతడి మనస్సులో ఏ ఆలోచనలు చెలరేగుతున్నాయి లాంటి సమస్తమూ అతడికి ఇట్టే తెలిసిపోయేవి. దీనిని తన మిత్రులతో పాలుపంచుకొని అనేక సందర్భాలలో అతడు వినోదించడం కద్దు.

 కాని శ్రీరామకృష్ణులు దీనిని ఖండించారు. *“ఇదొక గొప్ప వరప్రసాదం. కాని మానవాళి శ్రేయస్సుకు తప్ప మరి దేనికీ ఈ శక్తిని ఉపయోగించవద్దు. ఎవరివో గురించిన సమాచారాలను నీ వద్దకు తీసుకొనివస్తున్న ఈ చేతులు మానవాళి బాధలను తొలగించే శక్తి గలవి. నీ శక్తిని ఇతరుల బాధలను తొలగించడానికి ఉపయోగించు" అన్నారు శ్రీరామకృష్ణులు*.

శ్రీరామకృష్ణులు ఈ ఉపదేశం నరేంద్రునికి జీవితం గురించిన ఒక విభిన్న కోణాన్ని చూపిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. *మనకు భగవంతుడు ప్రసాదించే శక్తులను, విశిష్ట గుణాలను పరుల శ్రేయస్సు కోసం ఉపయోగించాలనే భావన అతడి మనస్సులో గాఢంగా ముద్రితమైంది. అయితే మరొక సంఘటన ద్వారా అది పరిపూర్ణంగా అతడి మనస్సులో పాదుకుపోయింది*.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
  *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

No comments:

Post a Comment