*నిజమైన ఆనందం*
*మనకు అనేక వస్తువులు దొరుకుతూ ఉంటాయి, కానీ కోరినది దొరకదు. ఒకవేళ అనుకున్నది దొరికినా, అప్పటికి ఆ వస్తువు మీద ఉండే కోరిక మరొక వస్తువు మీదకి మరలి ఉంటుంది.
*చాలామంది వారి కోరికల నిజతత్త్వాన్ని తెలుసుకోలేక ప్రాపంచిక విషయాల వెంట పరుగెడుతుంటారు. నిజానికి ఎన్నడూ మార్పుచెందనిది, శాశ్వాతమైనది మాత్రమే యథార్థమైన సంతృప్తిని ఇవ్వగలదు.
*ప్రాపంచికమైన కోరికలను తీర్చుకోవడం ద్వారా శాశ్వతమైన ఆనందాన్ని పొందాలని గాని, పొందగలమని గాని భావించేవారు తమను తాము మోసగించుకుంటున్నారు.
*కోరికలు తీరకపోవడం వల్ల కలిగిన లోటు వారి పరిస్థితిని మరింత దుర్భరం చేస్తుంది. బాహ్యమైన వస్తువులలోనూ, స్త్రీ-పురుషుల భౌతిక శరీరాలలోనూ సుఖసంతోషాల కోసం వెతుకుతారు.
*కానీ నిజమైన ఆనందం మనలోనే ఉంది. ఆ ఆనందమే మన యధార్థ స్వరూప స్వభావమై ఉంది. బాహ్యమైన వస్తుసంపదలు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు. ఒకవేళ ఎంతోకొంత సంతోషాన్ని ఇచ్చినా అది లిప్తపాటులో మాయమౌతుంది.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏
*రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయతను కూడా నేర్పుదాం.
No comments:
Post a Comment