Thursday, September 1, 2022

నిజమైన ఆనందం

 *నిజమైన ఆనందం*

*మనకు అనేక వస్తువులు దొరుకుతూ ఉంటాయి, కానీ కోరినది దొరకదు. ఒకవేళ అనుకున్నది దొరికినా, అప్పటికి ఆ వస్తువు మీద ఉండే కోరిక మరొక వస్తువు మీదకి మరలి ఉంటుంది.

*చాలామంది వారి కోరికల నిజతత్త్వాన్ని తెలుసుకోలేక ప్రాపంచిక విషయాల వెంట పరుగెడుతుంటారు. నిజానికి ఎన్నడూ మార్పుచెందనిది, శాశ్వాతమైనది మాత్రమే యథార్థమైన సంతృప్తిని ఇవ్వగలదు.

*ప్రాపంచికమైన కోరికలను తీర్చుకోవడం ద్వారా శాశ్వతమైన ఆనందాన్ని పొందాలని గాని, పొందగలమని గాని భావించేవారు తమను తాము మోసగించుకుంటున్నారు.

*కోరికలు తీరకపోవడం వల్ల కలిగిన లోటు వారి పరిస్థితిని మరింత దుర్భరం చేస్తుంది. బాహ్యమైన వస్తువులలోనూ, స్త్రీ-పురుషుల భౌతిక శరీరాలలోనూ సుఖసంతోషాల కోసం వెతుకుతారు.

*కానీ నిజమైన ఆనందం మనలోనే ఉంది. ఆ ఆనందమే మన యధార్థ స్వరూప స్వభావమై ఉంది. బాహ్యమైన  వస్తుసంపదలు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు. ఒకవేళ ఎంతోకొంత సంతోషాన్ని ఇచ్చినా అది లిప్తపాటులో మాయమౌతుంది.

           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏

*రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయతను కూడా నేర్పుదాం.

No comments:

Post a Comment