🎻🌹🙏 నామదేవుడు...!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿పండరీ పురంలోని పాండురంగడు భక్త సులభుడు. తన పరమ భక్తులతో ఒక మంచి స్నేహితునిగా సంభాషిస్తూండేవాడు.
🌸 అటువంటి వారిలో నామదేవుడు ఒకరు. కానీ , నామదేవునిలో తన భక్తి పరిపూర్ణమైనది కాదనే భావనతో సదా చింతించేవాడు.
🌿ఇదే విషయాన్ని పాండురంగ విఠలునికి నివేదించాడు.
🌸" అనుదా నాహనాధ్ అనే పుణ్యక్షేత్రంలో విఠోబా అనే మహానుభావుడు వున్నాడు.
🌿ఆయనను నీ గురువుగా
స్వీకరించు , నీ సందేహాలన్నింటికి మార్గం లభిస్తుంది " అని అన్నాడు. పండరీపుర విఠలుడు.
🌸ఆవిధంగానే, అనుదా నాహనాధ్ వెళ్ళేడు నామదేవ్.
అక్కడ వున్న ఒక శివాలయంలో
ఒక వృధ్ధుడు శయనించి వుండడం చూశాడు.
🌿ఆ వయోవృధ్ధుని పాదం ఒక శివ లింగం మీద వుంది. భగవంతుని రూపం మీద కాలు పెట్టడం మహా పాపంగా భావించిన నామదేవుడు ఆ వృధ్ధునితో
🌸' ఓ పెద్దాయనా ! మీ పాదం
శివలింగం మీద వున్నది. దయచేసి ఆ కాలును పక్కకు పెట్టండి అని పెద్దగా కేక పెట్టాడు.ఆ కేక కి ఆ వృధ్ధుడు
మేలుకున్నాడు.
🌿" నాయనా ! నాకు శరీరంలో శక్తి లేదు. నీవే నా కాలిని నీవే కొంచెం ప్రక్కకి జరిపి పుణ్యం కట్టుకో "అని అన్నాడు.
🌸వెంటనే నామదేవ్ లింగం మీద నుండి వృధ్ధుని కాలు
తీసి, మరొక చోట పెట్టేడు.
కాని ఆ కాలు పెట్టిన చోట కూడా మరొక లింగం వుండడం చూశాడు.
🌿నామదేవునికి విస్మయం కలిగింది. తనే అక్కడ మరొక లింగం వుండడం చూడకుండా కాలిని పెట్టడం జరిగిందేమోనని ,
🌸సందేహించి ఆ వృధ్ధుని కాలిని మరో చోటుకు మార్చాడు. ఆ చోటున కూడా వృధ్ధుని కాలి క్రింద మరో లింగం వుండడం చూశాడు నామదేవ్.
🌿నామదేవునికి సత్యం గోచరమైనది.
భగవంతుడు తను సర్వాంతర్యామిని అన్న విషయాన్ని
తనకు యీ విధంగా తెలియచేశాడని అర్థం చేసుకున్నాడు.
🌸తరువాత
సకల జీవులలోని ఆత్మ
ఒకటేనన్నది బోధపడింది.
🌿భగవంతుడు ఎక్కడో లేడు
మనలోనే వున్నాడు. ఆయన
నివసిస్తున్న ఆలయమే యీ దేహం .
🌸ఈ దేహాన్ని మనం
పవిత్రంగా చూసుకుని
కాపాడుకోవాలి. ఇతరులలో కూడా భగవంతుని దర్శించి
వారిని ఉన్నతంగా గౌరవించాలి...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment