🎻🌹🙏బ్రాహ్మదత్తుడు రాజు చిలుక కథ ..!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿బ్రహ్మదత్తుడు అనే రాజు, చిలుక స్నేహం గురించి ధర్మరాజుకు బిష్ముడు వివరించుచున్నాడు
🌸 బ్రహ్మదత్తునికి ఓ చిలుక మీద అభిమానం ఏర్పడి, అది కాస్తా స్నేహంగా పరిణమించింది.
🌿 ఆ చిలుక బ్రహ్మదత్తునికి సమీపంలోనే నివసిస్తూ ఉండేది. కాలం సాగుతుండగా ఆ చిలుకకి ఒక కుమారుడు జన్మించాడు.
🌸బ్రహ్మదత్తుని కుమారుడు ఆ చిట్టి చిలుకతో ఆటలాడుకునేవాడు. ఒకరోజు చిలుకతో ఆటాడుతున్న రాకుమారుడికి దానిపై కోపం వచ్చింది.
🌿 అంతే! దానిని తన చేతులతో చిదిమి ప్రాణాలు తీశాడు. ఆ దృశ్యాన్ని చూసిన చిలుకకు గుండె మండిపోయింది. కోపం ఆపుకోలేక తన గోళ్లతో అతని రెండు కళ్లనూ పొడిచింది.
🌸దీంతో రాకుమారుడు చూపుపోయి అంధుడిగా మారిపోయాడు. చిలుక అంతటితో ఆగకుండా రాజు దగ్గరకు వెళ్లి ఈ విషయం గురించి చెప్పింది.
🌿 ‘రాజా! నీ కుమారుడు నా బిడ్డను చంపి తప్పు చేశాడు. అందుకు ప్రతిఫలంగా నేను అతడ్ని కళ్లను పొడిచి గుడ్డివాడిని చేశాను.
🌸 ఇందులో నా తప్పేమీ లేదు. అయినా ఇకమీదట నేను ఇక్కడ ఉండలేను’ అని చెప్పింది.
🌿చిలుక మాటలు విన్న రాజు ‘నువ్వన్నది నిజమే! జరిగినదానిలో నీ తప్పేమీ లేదు. రాజకుమారుడు నీ కొడుకుకి హాని తలపెట్టాడు కాబట్టి ఫలితాన్ని అనుభవించక తప్పలేదు.
🌸 మరి అలాంటప్పుడు నన్ను వదిలి వెళ్లాల్సిన అవసరం నీకేమొచ్చింది? అయిందేదో అయ్యింది. దయచేసి ఇకమీదట కూడా నాకు మిత్రుడిగానే ఉండు’ అని అర్థించాడు.
🌿దీనికి చిలుక బదులిస్తూ..‘రాజా! నేను నీ కొడుకును అంధుడిగా మార్చేశాను.. కాబట్టి నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది.
🌸 ఇది నాలుగు రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఇతరుల భూమిని అపహరించడం వల్ల, ఆస్తి పంపకాల్లో అన్నదమ్ముల మధ్య, ఆడవారి మధ్య మాటామాటా పెరగడం వల్ల,
🌿ఎదుటివారి మనసుని గాయపరచడం వల్ల పగ పుడుతుంది. అలాంటి ప్రతికూల భావాలు ఒకసారి మొదలైతే, ఇక వాటికి అంతం ఉండదు.
🌸అలాంటి విద్వేషపూరిత వాతావరణంలో ఎవ్వరినీ నమ్మడానికి వీల్లేదు. నేను నీ కొడుకుకి అపకారం చేశాను కాబట్టి నీలో నా మీద విద్వేషం మొదలయ్యే ఉంటుంది.
🌿కాబట్టి నీ తీయ్యని మాటలు విని నేను ఇక్కడ ఉండలేను,’ అంటూ చిలుక ఎగిరిపోయింది.
🌸కాబట్టి ధర్మజా! రాజనేవాడు ఆ చిలుక మాదిరిగా తన జాగ్రత్తలో తనుండాలి. రాజ్యంలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మరాదు.
🌿సుతిమెత్తగా మాట్లాడుతున్నట్లు కనిపించాలే కానీ మనసు మాత్రం దృఢంగా ఉండాలి. అందరినీ నమ్మినట్లు ఉండాలి కానీ తన జాగ్రత్తలో తనుండాలి.
🌸 ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగరాదు. వ్యసనాలకు బానిసై విచక్షణ కోల్పోరాదు, అనుకున్న కార్యం పూర్తయ్యేదాకా రహస్యాన్ని బయటపెట్టరాదు.
🌿 అంతేకాదు, పూర్తిగా తీరని రుణం, పూర్తిగా ఆరని మంట, పూర్తిగా చల్లారని పగ... ఈ మూడింటి విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉండాలి.
🌸
ఎందుకంటే అవి ఎప్పుడైనా ప్రాణాంతకంగా పరిణమించగలవంటూ భీష్ముడు హెచ్చరించాడు ధర్మరాజుతో...🚩🌞🙏🌹🎻
🙏సర్వేజనాసుఖినోభవంతు🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment