Monday, September 19, 2022

పుట్టుక -చావు =జీవితం🌹 *🙏దేవుడు ఒక్కడే, ఆయనే పరబ్రహ్మం

 🌹పుట్టుక -చావు =జీవితం🌹
*🙏దేవుడు ఒక్కడే, ఆయనే పరబ్రహ్మం*🙏
ఎందుకు పుట్టమో తెలీదు!
ఎందుకు చస్తున్నామో తెలుసు!
తెలిసి తెలిసి, తెలియని రెండింటికి మధ్యలో ప్రారబ్దకర్మ జీవితం!
తెలిసి తెలియని జీవితంలో ప్రారబ్దమును పరమార్థంగా భావిస్తూ పరతత్త్వంను తెలుసుకోవడానికి వినియోగిస్తే ఆగామి, సంచిత కర్మలనుండి విముక్తి పొందగలం!!

తెలియని పుట్టుక తెలుసుకోవాలి అంటే తెలిసిన మరణాన్ని ఎందుకు అనేది తెలిసి, తెలియని జీవితంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి!!
అప్పుడే తెలియని పుట్టుక నీకు తెలిసి ఆ పుట్టుక అర్థం, పరమార్థం తెలుస్తుంది!!

ఇంక తెలిసిన మరణం గురించి మనకు తెలుసు?
ఏం తెలుసు అంటే తెలిసి, తెలియని జీవితంలో ప్రారబ్దంను కేవలం నాది, నేను మమకార, అహంకార స్వార్థం అనే పామరత్వం కోసం వినియోగిస్తూ కర్మ వలయంలో చిక్కి మళ్ళీ మళ్ళీ ప్రారబ్దంను అనుభవించడం కోసం పదే పదే తెలియని పుట్టుకను తీసుకొని అనేక రకాలుగా కష్టాలు పడుతున్నాం!!

కాబట్టి పామరత్వంకి పారమార్థంకి వున్న అక్షర తేడాలని గమనించి ఈ ప్రారబ్ద జీవితాన్ని పరమార్థం దిశగా పయనింపజేయగలిగితే తెలియని పుట్టుక అర్థం తెలిసి తెలిసి, తెలియని జీవితంలో ఆనందంగా సాగిపోతుంది!!...
.
.

దేవుడు ఒక్కడే ఆయనే పరబ్రహ్మం  
అసలు అనేకమంది దేవతలు ప్రధానులు కారు,
*దేవుడు ఒక్కడే, ఆయనే పరబ్రహ్మం*

*ఆయన్నే మనం వేరువేరుగా రూపాలు
కల్పించుకొని వరసిద్ధి గణపతిగా _ 
విధ్యాగణపతిగా _ లక్ష్మీగణపతిగా _
ఇలా వేరువేరుగా పూజలు చేస్తున్నాం *
త్రిమూర్తులటున్నాం * త్రిశక్తులంటున్నాం *
వీరంతా ఆయా కార్య సిద్దుల కోసం కల్పించబడ్డ వారే,

స్త్రీ తత్వం అంతా ఒక్కటే అయినా _
పిల్లల్ని పోషించే సమయంలో తల్లిగా _
పితరుల్ని సంతోష పరిచే సమయంలో కూతురిగా _       భర్తకు భార్యగా _ అన్నకు చెల్లిగా _
ఇలా వేర్వేరు మూర్తులుగా ఎలా రూపాంతరం _
చెందుతుందో ఆ పరబ్రహ్మం కూడా _
మాఘంలో సూర్యునిగా 
దసరాల్లో అమ్మవారిగా 
కార్తకంలో శివకేశవులుగా 
భాద్రపదంలో గణపతిగా 
వేర్వేరు ఉపాసనలు పొందుతున్నాడు*

గణపతుల్లో కూడా అనేక అవతారాలు ధరిస్తున్నాడు *
ఇవన్నీ సుగుణ రూపాలు ___
అంటే కన్నూ ముక్కు వంటి అవయవాలు
ధరించిన మూర్తులు ఈ తత్వాన్నే __
" *వేదం ఏకం సత్ విప్రాః బహుధా వదంతి* "
అని కీర్తిస్తోంది * అంటే ఉన్నది ఒక్కటే ! దాన్నే __
మనం ఈ మాయా జగత్తులో అనేకంగా చూస్తున్నాం !
~~~ నిజానికి అనేకం లేనే లేవు ~~~
అదంతా మాయ *
అద్దాల గదిలో నిలబడుతాం *
కానీ మనం ఒక్కరమే *
అవన్నీ మన ప్రతిబింబాలేనని మనకు తెలుసు *
వాటికి బొట్టు పెట్టాలంటే అన్నింటికీ పెట్టనవసరంలేదు
మనం పెట్టుకుంటే చాలు *
అది మన మూర్తులందరికీ పెట్టినట్లు అవుతుంది కదా,
కానీ మనం అజ్ఞానంతో __
అవన్నీ నిజమని భ్రమపడుతూ __
చేసేదే సద్గుణోపాసన 
అగజానన పద్మార్కం
గజానన మహర్నిశం
అనేకదం తం భక్తానాం
ఏకదంత ముపాస్మహే ...........

ఒక్కోసారి అన్నీ తెలిసిన జాగ్రత కంటే ఏమీ తెలియని సుసుప్తి నయం, తెలిసి తెలియని స్వప్నం ఇంకా దరిద్రం!!
ఎన్నీ తెలిసినా అన్నింటిని వదలగలిగే స్థితిని సంపాదించి నిద్రపోతేనే ఆనందం!!
పట్టుకోవడంలో కంటే వదలటం త్యాగంలోనే వుంది ఆనందం
     ఇలాంటి ప్రశ్నలకు, ఎవరు దేవుడు, చావు పుట్టుకలు గురించి బాధలు ఇబ్బందులు కష్టాలు అనగా దుఃఖ రహిత జీవితం గురించి ఎవరికి వారు తెలుసుకునే మార్గమే బుద్ధ ప్రభోదిత ఆనాపానసతి మార్గమే పత్రీజీ గురువు గారు చెప్పి ప్రచారాలు చేసిన శ్వాస మీద ద్యాస మార్గమే.
సేకరణ

No comments:

Post a Comment