Sunday, September 18, 2022

మాయ యొక్క సేవకురాలు అజ్ఞానం

 మాయ యొక్క సేవకురాలు అజ్ఞానం

ఎక్కడ చూసినా అజ్ఞానం కర్ర పట్టుకుని పెత్తనం చలాయిస్తూ ఉంటుంది. జ్ఞానం కోసం వెదికే వాళ్లు కూడా అజ్ఞానం వలలో పడి గిలగిల కొట్టుకుంటూ ఉంటారు. మాయ నియమించుకున్న అత్యంత వినయం కలిగిన సేవకురాలు అజ్ఞానం. అజ్ఞానం నిర్వహిస్తున్న బాధ్యతల తీరు తెన్నులు చూస్తుంటే, శ్రీరాముడిని అడవుల పాలు చేసిన కైకకు సాయం చేసిన కుబ్జ అనే సేవకురాలు గుర్తుకు వస్తుంది. శిశుషును మాయ కప్పేసినట్లు, చెరువులో నీటిని గుర్రపు డెక్క కమ్మేసినట్లు- జ్ఞానాన్ని అజ్ఞానం కనపడకుండా చేస్తోంది... అజ్ఞానమే జ్ఞానం. అన్న భ్రమను కలిగిస్తోంది.

మిడిమిడి జ్ఞానం కూడా అజ్ఞానమే. ఇది చాలా ప్రమాదకరం. ఆహంకార పూరిత జ్ఞానమూ ఆజ్ఞానమే ఇది వినాశనానికి హేతువు ఇది ఆజ్ఞానంలో ఉండి విజ్ఞానం గురించి సూట్లాడుతున్నామని పండితులుగా చలామణీ అయ్యేవారూ.. తెలుసుకోలేరు. వీళ్లు భగవద్గీత చెప్పిన పండితులు కారు. అజ్ఞానం కబంధ హస్తాల్లో
చిక్కుకుని ప్రపంచమే విలవిల్లాడే. పరిస్థితి వస్తూ ఉంటుంది. దీనికి కారణం యుగ ధర్మాలు, కాలం, ప్రకృతి ఈ రెండూ అజ్ఞానం ఆడిస్తున్న నాటకానికి సహకరిస్తూ ఉంటాయి. మాయ ఆధీనంలో వీటికి సూత్రధారి మాయ శ్రీకృష్ణుడి ఉంటుంది. మాయ వశమై ఉంటాం. ఇదొక విష వలయం అజ్ఞానం ఆనందం. కలిగిస్తూ ఉన్నా ఏ పుణ్యాత్ముడికే దీని మోసం బోధపడుతూ ఉంటుంది. అజ్ఞానం పైన విరక్తి. కలిగి, జ్ఞానం కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. కాని అంత తేలిగ్గా అజ్ఞానం పక్కకు తప్పుకోదు. నిన్ను జ్ఞానవంతుడిని చెయ్యడానికి ససేమిరా అంగీకరించదు. జ్ఞానం అంటే సత్యం. ఏది తెలిస్తే, తరవాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగలదో అదే నిజమైన జ్ఞానం అజ్ఞానం మధ్యలో బతుకుతుండగా జ్ఞానోదయం కావడమే: విచిత్రాల్లోకెల్లా విచిత్రం. అందుకే బుద్ధుడు అంటాడు. ఈ ఆజ్ఞాన ప్రపంచంలో, బురదలో పద్మంలా వికసించాను అని,
అజ్ఞానం రాజ్యమేలుతూ ఉంటుంది. ఇప్పుడే కాదు. ఎప్పుడైనా... చీకటిలో ఉన్నా, సూర్యుడి వైపు మొహం తిప్పుకొని వెలుగు మన మీద పడేటట్లు చూసుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను వెలుగులోకి తీసుకు రారు. ఏ స్థితిలోనూ ప్రహ్లాదుడు, తండ్రి ఆజ్ఞాన ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. హరిని సర్వశక్తిమంతుడిగా తెలుసుకుని, ప్రాణ త్యాగానికి సిద్ధపడి జ్ఞానానికి మోకరిల్లి చరిత్రలో నిలిచిపోయాడు. చూసేవన్నీ అందంగా ఉంటాయి. ఆకర్షణ కలిగిస్తూ ఉంటాయి. అవన్నీ జ్ఞాన మకరందాలని భావించకూడదు. అందులో మునిగిపోయి : అవే జీవన గమ్యంగా తీర్మానించుకోకూడదు. విలాసంగా విచ్చలవిడిగా బతుకుతుంటే... దానికి కారణం అజ్ఞానమని తెలుసుకోవాలి. వినయంగా,
నిరాడంబరంగా జీవిస్తుంటే దానికి కారణం జ్ఞానమని గ్రహించాలి.. ఏభై ఏళ్లనుంచి చీకటి తాండవిస్తున్న గదిలోకి వెలుగు తీసుకు రావాలంటే, ఏబై ఏళ్లు పట్టదు. ఒక చిన్న కిటికీ తెరిస్తే చాలు లేదా చిన్న దీపకళిక వెలిగించినా చాలు. వెంటనే వెలుగుతో ఇల్లంతా నిండిపోతుంది!

- ఆనందసాయి స్వామి.  

No comments:

Post a Comment