Sunday, September 18, 2022

నిరంతరం జ్ఞాపకాలతోసాగే జీవితంలో 'జ్ఞాపకాలులేని స్థితి'ని ఏ విధంగా తెలుసుకోవటం సాధ్యమవుతుంది ?

 💖💖💖
       💖💖 *"320"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
    

*"నిరంతరం జ్ఞాపకాలతోసాగే జీవితంలో 'జ్ఞాపకాలులేని స్థితి'ని ఏ విధంగా తెలుసుకోవటం సాధ్యమవుతుంది ?"*
**************************

*"నిజమే అనేక కొత్త జ్ఞాపకాలతో కొనసాగే జీవితంలో ఇది కష్టసాధ్యమే. అయితే అందుకు సాధనా మార్గం ఉంది. మనకి ఏర్పడిన జ్ఞాపకాలన్నీ మన ఊహ తెలియని వయసు నుండి ఏర్పడినవే. మనకి బుద్ధి తెలిసిన నాటికే మనం అనేక జ్ఞాపకాల సమూహంగా ఉన్నాం. ఏర్పడిన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వెళ్ళగలిగితే ఏ జ్ఞాపకం లేని మన స్వస్థితిని తెలుసుకునే అవకాశం ఉంది. మనలో ఎన్ని జ్ఞాపకాలు ఏర్పడినా, వాటి నడుమ మన ఆత్మ పవిత్రత స్థిరంగానే ఉంది. వివేకంతో సాధనచేసి ఆ పవిత్రతను పట్టుకోగలిగితే మనం కోరుకునే శాంతి పొందటం సాధ్యం అవుతుంది. ప్రతిరోజూ నిద్రలో మనం అకస్మాత్తుగా జ్ఞాపకాలన్నింటిని వదిలి, మనలోని శాంతిని ఎలా పొందుతున్నామో అలాగే ఆత్మవిచారణ, దైవనామస్మరణ, మంత్రజపం వంటి మార్గాలతో మనలోనేవున్న పవిత్రతను మెలకువలోనూ అనుభవించగలుగుతాం. ఏ కోరిక, జ్ఞాపకంలేని స్థితి నిద్రతో సమానమైన ధ్యానస్థితి అవుతుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
            

No comments:

Post a Comment