Sunday, September 18, 2022

నేను పరమాత్మనైతే నాలో చెడ్డ గుణాలు ఎందుకున్నాయి ?

 💖💖💖
       💖💖 *"319"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
    
*"నేను పరమాత్మనైతే నాలో చెడ్డ గుణాలు ఎందుకున్నాయి ?"*
**************************

*"అనారోగ్యంతో మంచాల పడ్డవాడి రూపాన్ని చూసే అద్దం ఆ క్షణంలో ఆ రూపాన్ని చూపించినా తాను మాత్రం ఆ రూపాన్ని పొందటంలేదు. అలాగే మనలోని చెడు గుణాలు ఆత్మపై కదలాడినా దాని పవిత్రత చెడటంలేదు. కాకపోతే మనం నీడల్లా కదిలే ఆ గుణాలనే ఆశ్రయించటంచేత, మనకి ఆ పవిత్రత తెలియకుండా పోతోంది ! ఆధ్యాత్మికతవైపు ఆసక్తి కలిగిన సాధకునికి అప్పటివరకూ తనకున్న అనేక చెడు గుణాలు, జ్ఞాపకాలు దైవదర్శనానికి ఆటంకంగా కనిపిస్తాయి. సాధన దశలో మన వికారాలు, క్రియలు చూసి బాధపడుతున్నాం కానీ ఆ క్రియల వెనుక ఉన్న పవిత్రతను తెలుసుకుని శాంతిని పొందలేకపోతున్నాం !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
           

No comments:

Post a Comment