Thursday, September 22, 2022

అమ్మ అలిగితే…?

 iX. ii. 2-5.     210922-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


               అమ్మ అలిగితే…?
                 ➖➖➖✍️

మనం చిన్నప్పుడు ఎంతో అల్లరి చేస్తుంటే, అమ్మ నాన్న తిడితే, ఏడుస్తూ అలుగుతాము, మూలన కూర్చుంటాము. పలకకుండా, అన్నం తినకుండా, గమ్ముగా ఉంటాము.

మరి అదే మన అమ్మ బాధపడి అలిగితే, మరి మనం ఎలా బుజ్జగించాలి, నవ్వించాలి? తల్లి దండ్రుల 60 ఏళ్ల వయస్సుకు ముందు, మనం ఏమి చేసినా వాళ్ళు పట్టుకుని ఉండరు, బాధ పడరు. కానీ వయస్సు ఉడిగిన తర్వాత, ఒంటరైన తర్వాత, చిన్న పిల్లలు లాగే వాళ్ళు అలుగుతారు. 

అయితే కడుపు లో బాధ చెప్పుకోవాలి అంటే, ఇష్టం అయిన పిల్లలు దగ్గర ఉండరు. దగ్గరగా లేదా దూరంగా ఉన్నా, ఇప్పుడు వినేవారు లేరు వినరు. తమకూ భవిష్యత్ లో, ఒంటరితనం ముదుసలి తనం వస్తుంది, అని ఆ సమయంలో అనుకోరు.

మరి మా అమ్మ షుగరు బీపీ ఉండి కూడా, బెల్లపన్నం తినవద్దు అంటే, దోసకాయ పచ్చడి మంట వద్దు అంటే, మైలు దూరం నడవ మంటే, ఎక్కువ పని వద్దు పడిపోతావు నీరసం వస్తుంది అంటే, టాబ్లెట్లు సమయానికి వేసుకోమంటే, ఒక్కోసారి కాసేపు అలుగుతుంది, కోపం తెచ్చుకోవడం జరుగుతుంది. ఆఖరికి బయట చిమ్మి నీళ్లు చల్లి ముగ్గు వేయవద్దు, ఈ వయస్సులో అన్నా, రోషం వస్తుంది.

అలిగి దుప్పటి కప్పకుని పడుకుంటుంది. ఎన్నో రకాలుగా బతిమాలి, చివరగా పాట అస్త్రం పాడితే కాళ్ళు పట్టుకుని, పాండురంగ మహాత్యం లోనిది. అప్పుడు నవ్వుతూ, ‘ఊరుకో ఏమిటి ఆ పాటలు మాటలు, ఇక్కడ నే ఉన్నా కదా,’ అని నవ్వుతుంది.

మీరూ ఆ పాట ప్రయత్నం చేయండి, అమ్మ ను నవ్వించండి. మనం మధుర బాలూ కావాల్సిన పని లేదు బయట జనం కోసం, ఇంట్లో వాళ్ళ కోసం, ఓ రెండు పలుకుల గాడిద స్వరాల గానం చేసినా చాలు, మంచి మనసుతో. 

మంచి పని ఇంట్లో   మన వాళ్ళ తోనే, జోవియల్ గా సంతోషంగా, ఉండటం చేతగాని బ్రతుకులు, ఎంత పదవి లో ఉన్నా ఎన్ని కోట్లు సంపాదించినా, ఇంక వారు పొందే ఆనందం ఏముంది?. 

ఈలోకంలోనే అల్ప సంతోషం ఉచితంగా పొందలేని వారు, పోయాక పరలోకంలో సంతోషంగా ఉంటారా? మరలా పాపాల ఫలితాలు కోసం, ఇక్కడ కే వస్తారు సుమా.

ఘంటసాల గారు మధుర గాత్రములో, ఎంటీయార్ జీవించారు. ఆ పాట పాడేటప్పుడు, ఘంటసాల గారు ఏడ్చే ఉంటారు. ఇది చూస్తూ ఉంటే, సాత్విక మనసులకు కన్నీళ్ళు తిరుగుతాయి.

అమ్మా.... నాన్నా
అమ్మా.... అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా, అమ్మా ||

పదినెలలు నను మోసి పాలిచ్చి పెంచి, మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన
ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చేసితీ, 
తలచకమ్మా తనయుని తప్పులు క్షమించవమ్మా, . . . అమ్మా... అమ్మా...

దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి, ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని
కనుగానని కామమున ఇలువెడల నడిపితీ
కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళుకడుగుతా నాన్నా... నాన్నా....నాన్నా...

మారిపోతినమ్మా నాగతి ఎరిగితినమ్మా, మీ మాట దాటనమ్మా ఒకమారు కనరమ్మా
మాతాపిత పాదసేవ మాధవసేవేయని, మరువనమ్మ || మాతా 
నన్ను మన్నించగరారమ్మా... అమ్మా... అమ్మా , అమ్మా అని 

ఏ పాద సీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూములకన్న, విమల తరము
ఏ పాదపూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను, పుణ్య తమము
ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని, ఆర్పగా, జాలిన అమృతఝరము 
ఏ పాదస్మరణ నాగేంద్రశయను ధ్యా నమ్ము కన్నను, మహానందకరము
అట్టి పితురుల పదసేవ ఆత్మ మరచి, ఇహపరమ్ముల కెడమై తపించువారి 
కావగలవారు లేరు, లేరు ఈ జగాన వేరే, నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా....నాన్నా 

ఈ పాట పాడుతూ ఉంటే, అందులో కనపడ రారమ్మా అని ఉంటుంది.

ఏరా ఎదురు గా ఉన్నా కదా, ఆ ఏడుపు ఎందుకు ఆపు అంటుంది, నవ్వుతూ.

ఇప్పుడు ఉన్నప్పుడు చూస్తావు, తర్వాత తెలీదు కదా, ప్రాక్టీసు కోసం లే అని నవ్వు కుంటాము.

ముదుసలి తల్లి దండ్రులు కు కావల్సింది, ఓ 4 నవ్వులు, మంచి మాటలు, ప్రేమ , ఆప్యాయత దగ్గర పెట్టుకుని, 6 ఏళ్ల పిల్లలు లా అంతే.

కనీసం నోటి తో ప్రయత్నం చేస్తారు కదూ..✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment