Thursday, September 22, 2022

మానవుడు బగ్వద్ సన్నిధికి చేరాలంటే - అత్యాశకు పోరాదు...!!!

 200922a2032.     210922-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀640.
నేటి…

               ఆచార్య సద్బోధన:
                   ➖➖➖✍️


మానవుడు బగ్వద్ సన్నిధికి చేరాలంటే -  అత్యాశకు పోరాదు...!!!

ఆనందమయమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరు కోరుకోవటం సహజం...

దాని కోసం ప్రతి యొక్కరు ప్రయత్నిస్తూనే ఉంటారు, అయితే మానవుడు తన ఆశకు పరిమితులని ఏర్పరుచుకోవాలి...

అది ఎలా???...
అన్నీ ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలను కోవడం వలన మానవునుకి ఆనందం లభించదు...

సంతృప్తి ప్రతి వ్యక్తికీ తప్పనిసరిగా ఉండాలి, అది లేకపోతే ఎంత ఉన్నా మనిషికి ఆనందం ఉండదు...

యత్ పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః |
ఏకస్యాపి న పర్యాప్తం తదిత్యతి త్రుషం త్యజేత్ ||

కోరికలను పెరగనిస్తూపోతే ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా ఒక వ్యక్తికి చాలవు, అందువలన అత్యాశకు అవకాశం ఇవ్వకూడదు...

భగవత్గీతలో శ్రీ కృష్ణ పరమాత్ముడు ఇలా చెప్పారు...!! 

యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః |
సమః సిద్దా వసిద్హౌ చ కృత్వాపి న నిబధ్యతే ||

తనకు దక్కిన దానితో సంతోష పడటం ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి, అత్యాశ లేని వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు.
అరణ్యాలలో నివసించిన ఋషులు చాలా సంతోషంగా జీవించారు, అక్కడ భౌతిక సంపదలు లేవు.
అయితే వారికీ సంతృప్తి అనే సంపద ఉన్నది, అది వారికి ఆనందాన్ని ఇచ్చింది...

మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సంతృప్తి అవసరం, మన కోరికలను తగ్గించుకోవటం మీద మన సంతృప్తి ఆధారపడి ఉంటుంది...
అందువలన మానవుడు అత్యాశను వదిలిపెట్టి సంతృప్తిని అలవరుచుకోవటానికి ప్రయత్నించాలి, అప్పుడే భగవంతునికి దగ్గరవుతారు.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment