Saturday, September 17, 2022

సమయ స్ఫూర్తి

 🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐
సమయ స్ఫూర్తి

ఒకప్పుడు సుజ్ఞాని అనే వర్తకుడు ఒకడు తన తోటివాళ్లతో ఓ బృందంగా ఏర్పడి ఒక ఊరి నుండి మరొక ఊరికి సరుకులను తీసుకువెళ్లి అమ్ముతుండేవాడు.

ఒకసారి ఆ బృందం ఒక అరణ్యం గుండా వెళ్లవలసి వచ్చింది. అరణ్యంలోకి ప్రవేశించక ముందే సుజ్ఞాని తనవారిని పిలిచి, ఈ ఆడవిలో జాగ్రత్తగా ఉండండి. నాకు చెప్పకుండా ఇక్కడ ఏ పండూ,దుంపా, ఆకూ తినవద్దు అన్నాడు. ఆ బృందం అలా నడుస్తుండగా వారికి ఒక ఊరు కనిపించింది. ఆ ఊరికి చాలా దగ్గరలో ఒక పెద్ద చెట్టు, ఆచెట్టునిండా బోలెడు పళ్ళు కనిపించాయి. ఆ పళ్ళు చూడటానికి ఆకర్షణీయంగా, పక్వానికి వచ్చిన రుచ్చికరమైన వాటిలా అనిపించాయి. 

వాస్తవానికి అవి విషపు పళ్లు.. కాని విషం సంగతి తెలియకపోవడంతో వారు వాటిని తినడానికి సిద్ధమయ్యారు. వారిలో కొంత మంది తమ బృందానికి నాయకుడైన సుజ్ఞానికి  చెప్పాలని నిర్ణయించుకున్నారు.

కాని మరికొందరు మాత్రం తొందరపాటులో ఆ పళ్ళని కోసుకుని తినేశారు. ఇంతలో సుజ్ఞాని అక్కడకు చేరుకున్నాడు. కొద్దిసేపు ఆ చెట్టునీ, ఊరినీ పరీక్షగా చూసి, ఈ పళ్ళు తినడానికి పనికిరావు. బహుశ ఇవి విషపూరితం కావచ్చు అని చెప్పాడు.

దాంతో వాటిని అప్పటికే తిన్నవాళ్లు బలవంతంగా వాంతి చేసి ఆ పండు ప్రభావం నుండి బయటపడ్డారు.

ఆ ఊరి ప్రజలు అక్కడకి వచ్చిన వాళ్లు ఆ పళ్లును తిని చనిపొతే ఆ నవాళ్ల సామాన్లు తీసుకు పోయేవాళ్లు. ఇప్పుడు కూడా అదే విధంగా తీసుకుపోవచ్చని భావించి ఊరివాళ్లు వచ్చి, అందరూ బాగానే ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.

అందులో ఒకడు ధైర్యం చేసి సుజ్ఞానిని అడిగాడు ఈ పళ్లు విషమని మీకెలా తెలిసింది?

సుజ్ఞాని చిరునవ్వు నవ్వి ఈ చెట్టు ఎక్కడానికి చాలా సులువుగా ఉంది, ఊరికి చాలా దగ్గరలో ఉంది. అయినా చెట్టు నిండా పళ్ళున్నాయి. ఎవరూ కోయడం లేదంటే ఈ పళ్ళు మంచివి కాదనేగా అర్ధం అన్నాడు.

తమ నాయకుడి సమయస్ఫూర్తి తమ ప్రాణాలను కాపాడిందని సంతోషిస్తూ అందరూ కాపాడిందని సంతోషిస్తూ అందరూ ముందుకు సాగిపోయారు.

No comments:

Post a Comment