Story 11
చీమలు నేర్పే పాఠం
చీమలేగా అని చిన్న చూపు వద్దు
నేర్చుకోవాలేగాని పెద్ద పాఠమే నేర్చుకోవచ్చు
ఎంత ఉత్సాహం వాటి ప్రయాణంలో
చురుకుగా నడుస్తూ ఎంత దూరమైన అలసిపోకుండా
కాస్త దూరమైన కష్టంగా నడుస్తున్న మనం నేర్చుకోవాలి నడక ఎంత హాయి అని
ఎంతటి ముందుచూపు వాటి సేకరణలో
రేపటికై ముందుగానే ఆహరం సేకరిస్తాయి
మనమేమో ముఖ్యమైన ధాన్యాన్ని మరిచి
ధనాన్ని దాచేస్తున్నాం
ఎవరో కొట్టి నేర్పించినట్టుగా పద్దతిగా పయనం
నువ్వు నేను అని తోసుకోకుండా వరుసక్రమంలో
ఎంతో క్రమశిక్షణతో నడవడం
చదువుకున్న మనం జ్ఞానం ఉన్న మనం
ఎక్కడా పాటించని క్రమశిక్షణ
చివరకు ఆలయాలలోను పలుకుబడితో
పరుగులు తీస్తాం
మట్టిలో కలిసిన తీపిని
మట్టిని వదిలి తీపిని మాత్రమే సేకరించేస్తుంటే
చెడు ఏదో మంచి ఏదో గుర్తించని మనం
చెడువైపు ఒక్కసారి మంచివైపు ఒక్కసారి వెళ్ళి
అనుభవం అని నామకరణం చేస్తున్నాం చెడు అయితే
అదృష్టం అని చెప్పేస్తున్నాం మంచి జరిగితే
ఆలోచనను పూర్తిగా మానేసి
ఇంతలో ఏదైనా అడ్డు తగిలితే ఆ వాటి దారిలో
కొన్ని దారితప్పి వెనక్కు
కొన్ని పక్కకు జరిగి వెళ్తాయి
కొన్ని అడ్డుపై ఎక్కి వెళ్తాయి
కొన్ని ఆ అడ్డును కొరికి వెళ్తాయి
ఇందులోనూ నేర్చుకుని మనిషి జీవితం ముడిపడిన విషయం
సమస్యకు బయపడి పారిపోయేవాళ్లు కొంతమంది
సమస్యను పక్కన పెట్టి వెళ్ళేవాళ్ళు కొంతమంది
సమస్యను పరిష్కరించి వెళ్ళేవాళ్ళు కొంతమంది
సమస్యపై ధైర్యంగా పోరాడి వెళ్ళేవాళ్ళు కొంతమంది
ఇలా ఎన్నో పాఠాలు నేర్పే చీమలు ఓ గురువులే..
No comments:
Post a Comment