*శాంతి, సుఖం ఈ రెండూ లభించే తీరులోవున్న తేడా ఏమిటి ?*
✍️ *శ్రీ రమణీయం*
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈
💫 *మన మనసు శాంతిని, దేహం సుఖాన్ని కోరుతుంది. సుఖం కావాలంటే కోరుకున్న వస్తువు సమకూరాల్సిందే.*
💫 కానీ శాంతి కావాలంటే అలాకాదు. కేవలం మానసిక భావన చాలు.
💫 మనకి కారు కొనుక్కోవాలి అనిపించింది. కారు లభించినప్పుడే దానిలో ఎక్కిన సుఖం మనకి దొరుకుతుంది. కానీ కారు కొనుక్కోవాలని మనం పెట్టుకున్న లోన్ అప్లికేషన్ మేనేజర్ అంగీకరించగానే మనకి శాంతి లభిస్తుంది.
💫 అలాగే వివిధ స్థాయిల్లో భక్తులు, శిష్యులు దైవం-గురువుల వద్ద అలాంటి శాంతినే పొందుతారు.
✅ *అది శరణాగతితోనే సాధ్యమవుతుంది.*
✅ అందుకే, గురు-దైవ దర్శనం అయిన వెంటనే మనం కోరుకుంటున్న శాంతిని పొందుతున్నాం.
💫 మనం కోరినది వారు ఇస్తారన్న విశ్వాసం ఉన్నవారికే ఈ శాంతి కలుగుతుంది.
✅ ఆ విశ్వాసమే మనలో శరణాగతిని కలిగిస్తుంది !
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈
No comments:
Post a Comment