💖💖💖
💖💖 *"321"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"క్రియా రహిత స్థితి గురించి తెలుసుకునే విధానం ఏమిటి ?"*
***************************
*"మనలోని పవిత్రతను గమనించాలంటే, క్రియా రహిత స్థితిని పొందాలి. అంటే మానసిక క్రియలను ఆపాలి. మానసిక క్రియలన్నీ కోరికతోనే పుట్టుకొస్తాయి. మన ఇష్టం దేనిపై ఉంటే మన మనసు అక్కడ ఉండేందుకు ఇష్టపడుతుంది. వ్యాపారం ఇష్టపడే వాళ్ళు షాపుల్లో, సంసారం ఇష్టపడే వాళ్ళు ఇళ్ళల్లో, దైవాన్ని ఇష్టపడేవాళ్లు గుళ్ళలో కాలం గడిపేందుకు మొగ్గుచూపుతారు. ఏ ఇష్టమైనా దానిని అధిగమించే మరో ఇష్టం వచ్చేంతవరకు నిలిచి ఉంటుంది. ఇది మనందరికీ అనుభవంలోనిదే. ప్రతిరోజూ పూజచేసే వ్యక్తి కూడా తాను ఇష్టపడే ప్రాణ స్నేహితుడు దూరప్రాంతం నుండి వస్తే త్వరగా పూజ ముగించాలని అనుకుంటాడు. అంటే ఏ ఇష్టానికి ప్రాధాన్యతనిస్తే అదే అక్కడ క్రియా రూపం దాలుస్తుంది. ఇష్టం అంటే కోరిక. కోరిక అప్పటికే ఉన్న ఒక అనుభవంవల్ల ఏర్పడుతుంది. మరి అనుభవం ఎలా ఏర్పడుతుందంటే విషయంలో మనం మమైకత పొందడంవల్లనే. మనలోని ప్రజ్ఞతో మనం ఉండగలిగితే ఏ క్రియా అనుభవంగా మారదు. మారినా అది మనను వేధించదు !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
No comments:
Post a Comment