Saturday, September 10, 2022

మన మన కళ్ళు తెరచి, తరచి తరచి చూస్తే:

 ॐశ్రీవేంకటేశాయ నమః
💝 మన మన కళ్ళు తెరచి, తరచి తరచి చూస్తే:~
💖 ధనమున్నదని, అనుచరణ గణమున్నదని, యౌవనం ఉన్నదని గర్విస్తూ ఎవ్వరినీ లెక్క చేయక కన్నుమిన్ను కానరాక ప్రవర్తిస్తుంటారు కొందరు.
💕 ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి. ఈ క్షణికమైన సంపదలను చూచుకొని మనిషి గర్విస్తాడు. అహంకరిస్తాడు. శాశ్వతమనుకొని భ్రమ పడతాడు.
💓 కావలసినంత ధనం ఉన్నదని, ఇళ్ళూ, వాకిళ్ళు, తోటలు, దొడ్లూ, భూములు, బ్యాంకు బ్యాలెన్సులూ ఉన్నాయని, ఎవరి దగ్గరా చేయి చాపనవసరం లేదని, గర్విస్తారు. వీటిని చూసుకొని కళ్లు మూసుకొని పోతాయి. ధన పిశాచి పట్టినవాడికి భార్యా, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇరుగు, పొరుగు అనే భావం ఉండదు. అంతా డబ్బే. డబ్బున్నవారు మిత్రులు, డబ్బులేని వారు శతృవులు. అన్నింటిని డబ్బుతోనే విలువ కడతారు.
❤️ తన వెనుక ఎందరో ఉన్నారనుకుంటారు మరికొందరు. తనవల్ల ఏదో ప్రయోజనం పొందాలని తనను ఆశ్రయించిన వారందరూ తనవారే అనుకుంటారు. అందరూ తన శ్రేయోభిలాషులే అనుకుంటారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఈ కోవలోకే వస్తారు. తన అధికారాన్ని చూచి తన చుట్టూ చేరిన వారిని చూచి గర్విస్తారు. కాని ‘అధికారాంతము నందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నట్లు అధికారం పోతే తెలుస్తుంది....తన శ్రేయోభిలాషులు ఎవరో ఎంత మందో..!
💝 యవ్వనం శాశ్వతం అనుకుంటారు కొందరు. శరీరంలోని బిగువులు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని అతడి/ఆమె గర్వం.. ఆ గర్వంలో అతడు/ఆమె మంచి.. చెడూ.. గమనించరు. కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తారు. అహంభావంతో ఉంటారు. ముసలివాళ్ళను ఎగతాళి చేస్తారు.
💖 హరతి నిమేషాత్కాలః సర్వం.
💞 ~’ఈ మొత్తం ఒక్క క్షణంలో హరించిపోతాయి’ అని తెలుసుకోలేరు... ఒక్క 10 సెకండ్లు భూకంపం వస్తే నీ ఇళ్ళూ, వాకిళ్ళు, ధన సంపదలూ అన్నీ నేలమట్టమైపోతాయే! “నాకేం కోట్ల విలువచేసే ఆస్తి ఉంది. బ్రహ్మాండమైన భవనం ఉంది…”అని గర్వించిన వాడు మరు క్షణంలో ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తున్న సంఘటనలను మనం అనునిత్యం చూస్తూనే ఉన్నాము కదా..!
💝 ఇప్పుడేమైంది ఆ గర్వం.. నీ ధనం నిన్ను రక్షిస్తుందా.. నీ జనం నిన్ను రక్షిస్తారా.. అలాగే యౌవనం కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది కాదు. వృద్ధాప్యం ఎక్కిరిస్తూ ప్రతీ జీవి మీదికి వచ్చి కూర్చుంటుంది.  ఇదంతా మాయా జాలం అని, క్షణికమైనవని భావించాలి.
💝 ఘడియల్ రెంటికో మూటికో ఘడియకో / కాదేని నేఁడెల్లియో కడనేడాదికొయెన్నడో ఎరుగమీ / కాయంబు లీ భూమిపైఁ బడగానున్నవి,దర్మమార్గ మొకటిం / బాటింపరీ మానవుల్ చెడుగుల్ నీపదభక్తియుం దెలియరో / శ్రీకాళహస్తీశ్వరా!
💝 తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సుమనుట ఖాయం
ఓ జీవా తెలుసుకో అపాయం
ఉబ్బుతబ్బులై ఉరుకులు తీయకు 
గబ్బుమేను జీవా అవును గబ్బిలాయి జీవా

No comments:

Post a Comment