Monday, October 24, 2022

మంచి మాట...లు(24-10-2022)

సోమవారం --: 24-10-2022 :--
ఈ రోజు AVB మంచి మాట...లు
నిన్ను వదిలీ వెళ్ళిన వారి గురించి ఆలోచించకు, నీతో ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించకు,ఎవరో నీ బాధను అర్థం చేసుకుంటారని ఆశించకు, నీకు నువ్వే తోడు నీ దైర్యమే నీకు సరిజోడు,

సృష్టిలో ఏ విషయాన్నైనా ఉన్నది ఉన్నట్టుగా చూడడం ఎవరి తరం కాదు , ప్రతి ఒక్కరూ తమ కోణం నుంచి తమ మనోభావాలకు అనుకూలంగానే చూస్తారు అందుకే తమకు నచ్చిన వారిని చేర్చుకుంటారు తమని నచ్చని వారిని దూరం పెడతారు .

మన జీవితంలో ఎవరో ఒకరు గుణపాఠం నేర్పిస్తూనే ఉంటారు , ఒకరు ప్రేమలో,ఇంకొకరు స్నేహంలో,మరొకరు బంధుత్వంలో, ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ప్రతి చోటా మనమే గుణపాఠం (పాఠం )నేర్చుకుంటూ ఉంటాం.

కానీ ఒక్కటి మాత్రం నిజం దెబ్బ తిన్నవాడికే గెలవాలి అనే తపన ఎక్కువ ఉంటుంది అందుకని నువ్వనుకున్నది గెలిచే వరకూ తపించు, పోరాడు విజయం సాధించు చివరగా విజయ మాధుర్యాన్ని అనుభవించు .

మనకు విలువ లేని చోట మాట్లాడరాదు, ప్రేమ లేని చోట ఆశ పడరాదు, మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నవారి కోసం ఎదురు చూడకుడదు,

మన ఆత్మ గౌరవం పణంగా పెట్టి ప్రేమించకుడదు, మనల్ని దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వాలని చూడకుడదు,మనం భారం అనుకున్న వాళ్ళతో మన భావాల్ని పంచుకోవద్దు, మనది కానిది దేనిపైన ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు, మన నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా ఉండొద్దు.

కోరుకున్నవి అన్ని కావాలంటే ఎవరికీ సాధ్యం కాదు..మనం కష్టపడి సంపాదించినవి, దేముడిచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుంటూ జీవిద్దాం. తినటం కోసం బతకటం కాకుండా బతకటం కోసం తిందాం తక్కువ తింటే ఆరోగ్యం, ఎక్కువ తింటే అనారోగ్యం 💐💐🌹🌷🤝


సేకరణ 🖊️*మీ ...ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🌹🤝🌷

No comments:

Post a Comment