Friday, October 21, 2022

యోగి వేమన, భగవన్ రమణ మహర్షి

 యోగి వేమన, భగవన్ రమణ మహర్షి ‌.ఇద్దరు బ్రహ్మ మయమై సమాజ ఉద్దరణ కు నడుము బిగించిన వ్యక్తి యోగి వేమన అయితే మౌనం తో ఈ విశ్వనికే భాష్యం చెప్పిన వ్యక్తి భగవన్ రమణులు ఇద్దరు కౌపినధారులే,ఒకరు రాజవంశానికి చెంది భోగి అయి విరక్తి చెంది పరమేశ్వరుడే గురువు గా భావించి  ఆనాటి పామరుల సైతం నాలుగు పాదాల నుంచి పద్య సాహిత్యాన్ని అందించిన మహయోగి అయి పరుశవేదం ద్వారా పసిడి(బంగారం)చేసే విద్య ను నేర్చకోని బంగారం లాంటి మంచిపద్య సాహిత్య న్ని అందించిన మహయోగి అయి పాదచారి గా దేశ సంచారం చేస్తూ అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లిలో యోగి వేమన కోన్ని శాతబ్దాల క్రిందట జీవ సమాధి అయి యోగ సాధకులకు అక్కడ నుంచే దిశ దశ నిర్దేశం చేస్తూ వుంటారు. ఇంక భగవన్ రమణ మహర్షి విషయం కు వస్తే తమిళనాడు రాష్ట్రంలోని మదురై వద్ద తిరుచ్చుళి అనే ఊరు లో జన్మించి ఆయన పదహారు వ ఏటనే తిరువణ్ణామలై (అరుణాచలం) చేరి పరమేశ్వరుడే గురువు గా భావించి మౌనంతోనే విశ్వ వ్వాప్తమై బ్రహ్మ మయమై మహర్షి గా "నిన్ను నీవు తెలుసు కో..... నీవు ఎవరు....?" అనేమాటతోనే నీ ఆత్మ లోనికి వెళ్ళి తే ఆత్మ దర్శనం కలుగుతుంది అని విశ్వానికే ఆ సందేశం ఇవ్వడం తో ఆ మౌన జీవితం లోనికి వెళ్ళాగలిగిన వారికి నేటికి భగవన్,1950 లోశరీరం భగవన్ రమణ మహర్షి దిశ దశ నిర్దేశిస్తూన్నారు. 

No comments:

Post a Comment