Monday, October 24, 2022

 🍀🪷💦🌻🌹🌈

 🌸🌿మనవాళ్లు మన గురించి చెప్పేదాని కన్నా,శత్రువులు మన గురించి చెప్పేది నిజానికి దగ్గరగా ఉంటుంది.ఎలాగైతే మన వీపును చూసుకోలేమో అదేవిధంగా మన లోపాలను మనం గుర్తించం... 

 కొన్నిసార్లు నిర్మాణాత్మకమైన విమర్శలను మనం నిరాకరిస్తాం. అది మనలోని అహంభావాన్ని పెంచి పోషిస్తుంది. 

 సద్విమర్శలు మన ఎదుగుదలకు తోడ్పడి, వ్యక్తిత్వానికి వన్నె తెస్తాయి.సద్విమర్శ అయితే స్వీకరించాలి.

 చెడు విమర్శ అయితే విమర్శించిన వ్యక్తికి అర్హత, అవగాహన ఉన్నదీ లేనిదీ తెలుసుకుని ప్రతిస్పందించాలి. 

 మూర్ఖులు నిజానిజాలు తెలుసు కోకుండా విమర్శిస్తారు

 మేధావులు వాస్తవాలను గుర్తించి లోటుపాట్లు దిద్దుకునేలా మాట్లాడతారు 
 కాబట్టి.. 
స్పందించే ముందు మనసులో యోచన, మాటలో సూచన, క్రియలో ఆలోచన ఉన్న వ్యక్తులే జీవితంలో ముందుకు వెళ్ళగలరు విజయాన్ని సాధించగలరు... 

 🌄శుభోదయం

🍀🪷💦🌻🌹🌈

No comments:

Post a Comment