Monday, October 24, 2022

మంచి మాట.లు(18-10-2022)

18-10-2022:-మంగళవారం
ఈ రోజు AVB మంచి మాట.లు

నీ జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని అంకెలు మార్చుకోమని ఇల్లు మార్చుకోమని ఇలవేల్పును మార్చుకోమని చెప్పుతారే కానీ, బుద్ధి మార్చుకోవాలి అని ఎవరు చెప్పరు,

జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి లాగే మనషులు ఉండే కాలం ఇది, అందుకే వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి

అన్నం లేకపోవడమే పేదరికం కాదు కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం .

నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా నిజాయతి గా ఉన్న వారికి నిందలు ఎక్కువ,

అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం, అలసి పోయి కన్నుమూస్తే ఆపలేదు బంధం, దారిలోను చీకటైతే తోడు రాదు నీడ, జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ,,అందుకే నిన్ను నువ్వే నమ్ముకో నీ లాగే సాగిపో, ఇంకొకరిని చూసి వాత పెట్టుకోకూడదు .
సేకరణ ✒️ AVB సుబ్బారావు

No comments:

Post a Comment