Friday, October 7, 2022

అమ్మకు అన్నీ తెలుసు...🙏🏻

 అమ్మకు అన్నీ తెలుసు...🙏🏻
🪷🪷🪷🪷🪷

బాలగా వెళ్ళి చిన్న చిన్న మాటలతో బుజ్జగించింది వినలేదు, 

సరే మరునాడు వెళ్ళి గాయత్రిగా జ్ఞానభోధ చేసింది. బుర్ర  నిండా వక్రాలోచనలుండగా జ్ఞానం ఏమెక్కుతుంది? వినిపించుకోలేదు.

 "అయ్యో పాపం కడుపు నిండక ఇలాంటి ప్రకోపాలకు పోతున్నాడు " అని అనుకొని మరునాడు కన్న తల్లిగా అన్నపూర్ణయ్యి కడుపు నింపింది. కడుపు నిండాక మరిన్నీ వికృత చేష్టలు మొదలయ్యాయి. మళ్ళీ మొదటికి వచ్చాడు.

 మరునాడు సరస్వతిగా వచ్చి మళ్ళీ బుద్దులు చెప్పింది. ఊహూ.. అదే మంకుపట్టు, అదే రాక్షసత్వం.. మారలేదు.

 మరునాడు లాలిత్యంతో లలితగా "నువ్వు నడుస్తొన్న దారి తప్పు " హెచ్చరించింది. వినలేదు. 

మరునాడు మహాలక్ష్మిగా వచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి "ఇకనైనా బుద్ధిగా ఉండమని " అంది. "నీతోటే ఉంది అసలైన ఐశ్వర్యం " అని అన్నాడు. 

 ఇక నయాన అవ్వద్దు అని గ్రహించింది, కోపితురాలయ్యింది కళ్ళెర్ర చేసింది దుర్గగా బెదిరించింది. కోరకూడనిది కోరాడు,

 ఆ కోరిక విని తల్లిగా తల్లడిల్లింది, తప్పదనుకొంది మెడమీద కాలు వేసి  మర్థించి మహిషాసురమర్థిని అయ్యింది.

ఈ నవరాత్రులు చెప్పేది ప్రతీ స్త్రీ/ ఆడపిల్ల రాజరాజేశ్వరీదేవే! 

బ్రహ్మ, విష్ణు, శివాత్మికాయ.  కోరినవాడికే శృంగార సౌందర్యలహరి అవుతుంది, కోరరాని వాడు కోరితే మహిషాసురమర్థిని అవుతుంది.

తల్లిగా చూస్తే హనుమంతుడిని చిరంజీవిని చేసింది, కూతురిగా చూస్తే హిమవత్ పర్వతాన్ని తపస్సులకు  చేసి పూజలందించింది, చెల్లిగా చూసిన శ్యామశాస్త్రిని  సంగీత సామ్రాట్టు గా చేసింది, ఇలా కాదు ఇంకోలా చూస్తా అన్న రావణాసురిడి, నరకాసురిడిని, మహిషాసురుడినీ ఎలా చూడాలో ఆవిడకు తెలుసు.🙏🏻

🌹శ్రీ మాత్రే నమః🌹 

🪷🪷🪷🪷🪷

No comments:

Post a Comment