నీ గురించి నీవే డబ్బ కొట్టుకోకు, నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే... వంద మంది గొప్పవాళ్ళ గురించి నీవు ముందు తెలుసుకోవాలి.
కోపగించుకోవడం అంటే మనమీద మనమే ప్రతీకారం తీర్చుకోవడం.
ప్రతీకారం అంటే కుక్క మనల్ని కరిచిందనీ మనం కుక్కను కరవటం లాంటిది.
ప్రతీకారం సాధారణంగా
ఒక చిన్న ఒప్పుని చాలా పెద్ద తప్పుగా మారుస్తుంది
ప్రతీకారానికి అంతు అనేదుండదు
కన్నుకు కన్నె సమాధానమైతే లోకంలో మిగిలేది చీకటే.
ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో ఉండదు. అతని మంచి హృదయంలో ఉంటుంది.
వ్యక్త్విత్వన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్టే, ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి.
నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు మారవచ్చు కాని, మనం చేసిన మంచి ఎన్నటికీ మారదు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది... మంచి పని నిన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది.
.......✍️ ఈ చంద్రశేఖర్ రెడ్డి
ధర్మవరం
No comments:
Post a Comment