Sunday, November 27, 2022

పులస్త్య మహర్షి గురించి తెలుసుకుందాము..

 🎻🌹🙏 మన మహర్షుల చరిత్రలు..

🌹🙏ఈరోజు 48 వ పులస్త్య మహర్షి గురించి తెలుసుకుందాము..🙏🌹

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿పులస్త్య మహర్షి ముందు ఎలా పుట్టాడో తెలుసుకుందామా !  అయితే వినండి బ్రహ్మగారి కుడి చెవి నుంచి పుట్టాడు .

🌸బ్రహ్మగారు చెప్పినట్లే తపస్సు చేసుకుంటూ క్రోథం , కామం జయించి అపరశివుడిలా వెలిగిపోతూ ఉన్నాడు పులస్త్య మహర్షి బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం కర్దమ ప్రజాపతి తన కూతురు హవిర్భవుని పులస్త్యుడికిచ్చి పెళ్ళి చేశాడు . 

🌿వీళ్ళకి అగస్త్యుడు పుట్టాడు . తర్వాత పులస్త్యుడు సంసారం వదిలిపెట్టేసి తృణబిందు ఆశ్రమానికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడు . 

🌸అందమైన ఇద్దరు ఆడపిల్లలు ఆ ఆశ్రమంలో తిరుగుతూ పులస్త్యుడున్న చోటికి వచ్చారు . వాళ్ళు ఆ ఆశ్రమంలో వున్న పూలు చెట్లు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూహాయిగా తిరిగేస్తున్నారు . 

🌿తపస్సుకి విఘ్నం కలగడానికి ఇష్టపడక పులస్త్యుడు నాకు కనపడిన ఆడపిల్ల వెంటనే గర్భవతవుతుందని శపించాడు . 

🌸ఆ పిల్లలిద్దరూ పారిపోయారు . 
ఈ సంగతి తెలియక తృణబిందుడనే రాజర్షి కూతురు ఆశ్రమంలో తిరుగుతూ పులస్త్యుడున్న చోటికి వచ్చి వెంటనే గర్భవతి అయింది . 

🌿ఏడుస్తూ తండ్రికి చెప్పింది . తృణబిందుడు దివ్యదృష్టితో చూసి ఈ విధంగా జరగడం పులస్త్యుడి శాపం వల్ల అని తెలుసుకుని కూతుర్ని తీసుకుని పులస్త్యుడి దగ్గరకి వెళ్ళి జరిగింది చెప్పి ఆమెని పెళ్ళి చేసుకోమన్నాడు .

🌸పులస్త్యుడు అంగీకరించగానే ఇద్దరికీ పెళ్ళి చేసి ఆమెని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు తృణబిందుడు . ఆమె కూడ అక్కడే వుండి మహర్షికి కావలసినవి అందిస్తూ వుండేది . కొంతకాలానికి ఆమెకి ఒక కొడుకు పుట్టాడు . 

🌿కడుపులో ఉండగానే తండ్రి చదివే శ్రుతులన్నీ విన్నాడు . అతనికి విశ్రవసుడని పేరు పెట్టారు .

🌸విశ్రవసుడు తండ్రిలాగే విద్యలు నేర్చి తపస్సు చేసుకుంటూ దేవవర్ణిని పెళ్ళి చేసుకుని రావణ , కుంభకర్ణ , విభీషణ , శూర్పణఖలను పొందాడు . 

🌿రావణుడు బ్రహ్మ వల్ల వరం పొంది గర్వంతో కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి వెడితే కార్తవీర్యుడు చెరసాలలో పడేశాడు .

 🌸పులస్త్యుడు కార్తవీర్యుడింటికి వెళ్ళి రావణుణ్ణి విడిచిపెట్టమని అడిగాడు . కార్తవీర్యుడు పులస్త్యుడికి సత్కారం చేసి ఆయన చెప్పిన విధంగా రావణుణ్ణి విడిపించి సంపదలిచ్చి పంపాడు .

🌸ఒకసారి పరాశరుడు రాక్షసుల మీద కోపంతో సత్రయాగం మొదలు పెట్టి రాక్షస సంహారం చేస్తుండగా వసిష్ఠుడు వచ్చి ఆపాడు . 

🌿పరాశరుడు దగ్గరకి వచ్చిన పులస్త్యుడు అంత కోపంలో ఉండి కూడ యాగం ఆపమనగానే ఆపినందుకు ఆనందించి పరాశరుణ్ణి వరం కోరుకోమన్నాడు .

🌸తన మనసెప్పుడు వేదపురాణాల మీద ధ్యాసతో ఉండాలని , వేదశాస్త్రాల్లో గొప్ప ప్రతిభ కలిగి ఉండాలని కోరుకుని పులస్త్యుడి దగ్గర వరం పొందాడు పరాశరుడు .

🌿భీష్ముడు గంగా నదీతీరంలో తండ్రికి పితృకర్మలు చేస్తుంటే పులస్త్యుడు అక్కడికి వెళ్ళాడు . భీష్ముడు మహర్షిని పూజించి ఆయన పాదాలు తలమీద పెట్టుకుని స్వామీ ! ఆజ్ఞాపించండి అన్నాడు .

🌸భీష్మా ! నీకేమయినా సందేహాలుంటే అడుగు చెప్తాను అన్నాడు పులస్త్య మహర్షి . మీరు తీర్థప్రియులు కదా ! తీర్థయాత్రల వల్ల కలిగే ఫలితాల గురించి చెప్పండని భీష్ముడు అడిగాడు .

🌿పులస్త్యుడు భీష్మా ! ఇంద్రియాల్ని జయించడం , గర్వం , కోపం , ప్రతిఫలాన్ని ఆశించకపోవడం , మితంగా తినడం , నిజాన్నే పలకడం , ఎప్పుడు సంతోషంగా ఉండడం

🌸మంచిపనే చెయ్యడం ఇలాంటివి చేసేవాళ్ళకి అన్ని తీర్థాలవల్ల వచ్చే ఫలితము దానికదే వచ్చేస్తుంది . ఎక్కడికీ తిరగక్కర్లేదు . 

🌿పుష్కర తీర్థంలో స్నానం చేస్తే బ్రహ్మలోకం వస్తుంది . జంబూమార్గం , తండులికాశ్రమం , అగస్త్యసరం వీటి వల్ల అశ్వమేధయాగం చేసిన పుణ్యం ,

🌸రుద్రకోటి అనే తీర్థాలు కురుక్షేత్రం , సోమతీర్థం , నర్మద , దక్షిణ సింథు , చరణ్వతి , సరస్వతి , సాగర సంగమం , పింగళతీర్థం ఇలా అన్ని తీర్థాలకి దీని ఫలితం దానికే వుందని పులస్త్యుడు తీర్ధాల విశేషాలన్నీ భీష్ముడికి చెప్పాడు . 
భీష్ముడు అన్ని తీర్ధాలకి వెళ్ళి ప్రశాంతంగా కాలం గడుపుతున్నాడు .

🌿పులస్త్యుడు స్మృతికర్త , బ్రహ్మ , మహర్షి , సర్వజ్ఞుడు , సర్వదేవతల పూజలందుకున్నవాడు అని పేరు తెచ్చుకున్నాడు .

🌸ఇదండి పులస్త్యుడు మహర్షి గురించి మనం తెలుసుకున్నది రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment