Sunday, November 27, 2022

శ్రీరమణీయం: మహత్యం విధి విధానంలో భాగమైనప్పుడు ఎందుకు విలువనిస్తున్నాం ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"392"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     

*"మహత్యం విధి విధానంలో భాగమైనప్పుడు ఎందుకు విలువనిస్తున్నాం ?"*

*"నిజానికి మనం మహత్యం అని దేన్ని అయితే భావిస్తామో అది మనకి కొత్తది కానీ సృష్టి విధానంలో లేనిది కాదు. మనం ఎక్కిన కారు అదుపుతప్పి వెనక్కి వస్తున్నప్పుడు ఏదో ఒక రాయి అడ్డుపడి అది ఆగుతుంది. అది ఆ కారులో ఉన్నవారికి మహత్యంగా అనిపిస్తుంది. నిజానికి అక్కడ జరిగింది విధానానికి విరుద్ధంగా ఏదీలేదు. రాయి అడ్డుపడితే కారు ఆగటం అనేది సహజ ప్రక్రియ. మనం బస్టాండుకు ఆలస్యంగా వెళ్ళినప్పుడు బస్సు కూడా ఆలస్యంగా వస్తే దాన్ని మహత్యం అనుకుంటాం. కానీ బస్సు ముందు వెనుకలుగా రావటం దాని విధానంలో ఉన్నదే. అసలు సృష్టి విధానమే మహత్యంగా ఉంది. కానీ ఆ విధానంలో ప్రత్యేకంగా మహత్యాన్ని వెతకటం మనకు అలవాటైంది. మహత్యం అని మనం భావించేది, అనుకోకుండా జరిగే అసాధారణ విషయంకదా. మనసు ఆలోచించేలా చేసింది కనుక అది ఆశ్చర్యం అయ్యింది. కానీ మన జీవితాన్ని సునిశితంగా పరిశీలిస్తే ప్రతి క్షణం ఇలాంటి మహత్యాలు ఎన్నో కనపడతాయి. ఈ సృష్టి విధానమంతా మహత్యంగానే కనబడుతుంది. సృష్టిలో ప్రతిక్షణం జరిగే మహత్యాలని తెలుసుకుంటే భగవంతుడే అర్థం అవుతాడు !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
            

No comments:

Post a Comment