Friday, November 18, 2022

మన మహనీయులు _అనుభవాలు

 🔥మన మహనీయులు _అనుభవాలు💥

🌹ఇప్పటివరకూ వచ్చిన మంచి పుస్తకాలన్నీ చదవటమంటే.. గత శతాబ్దాలకు చెందిన మహనీయులందరితో ముఖాముఖీ మాట్లాడటం💯

🌹ఒక గమ్యమంటూ లేనివారికి ఏ లాంతరూ దారి చూపలేదు 💯

🌹నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేవారికి నిరాశ అనేది కలగదు💯

🌹ఇంటికప్పులోని రంధ్రం ఎండలో కన్పించకపోవచ్చు కానీ వానలో దాని బండారం తప్పక బయటపడుతుంది💯

🌹గెలవాలన్న తపన తగ్గితే ఓటమి దగ్గరయినట్లే💯

🌹మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్శాలి. కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్లాలి💯

🌹నిన్ను నువ్వు పొగుడుకోనవసరం లేదు. తిట్టుకోనవసరం లేదు. నువ్వేంటనేది నీ పనులే చెబుతాయి💯

🌹ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులు ఉంటాయి. ప్రతి అడ్డంకి వెనకా కొన్ని అవకాశాలు ఉంటాయి. మనం దేన్ని చూస్తామన్నదే ముఖ్యం💯

🌹పొరుగింటి గోడలు శుభ్రంగాలేవని విమర్శించడం కాదు. నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకో💯

🌹నీ తప్పుల్ని ఇంకొకరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు💯

🌹రహస్యం.. నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని💯

✒️ సేకరణ
💕విప్పోజు శ్రీనివాస ఆచార్య విశ్వకర్మ💞

No comments:

Post a Comment