Friday, November 18, 2022

🏵️స్త్రీలలో మూత్రంలో మంట, యోని స్రావాలు,సుఖ వ్యాధి🏵️.

 🏵️స్త్రీలలో మూత్రంలో మంట, యోని స్రావాలు,సుఖ వ్యాధి🏵️.
Anu power yoga Natural healing center. 9381490085

ఆడవాళ్ళకు అంతా గుట్టే అంటారు. స్త్రీ జననేంద్రియ వ్యాధుల విషయంలో కూడా ఇదే మాట చెప్పుకోవాల్సి వస్తుంది. వ్యాధి ఉన్న లక్షణాలు గుట్టుగా ఉండే స్త్రీలు సగానికి సగం ఉన్నారు. ఉన్న లక్షణాలు దేనివో తెలియనంత అస్పష్టంగా ఉండే స్త్రీలు కొందరు ఉన్నారు.మొత్తం మీద స్త్రీల వ్యాదాలంటేనే అయోమయం అనిపిస్తాయి.

స్త్రీలలో మూత్రం మంట ఒక్కటి విడిగా రావడం అరుదు! దానితోపాటు యోనిమంట అసహజ యోనిస్రావాలు (తెల్లబట్ట) కలిసి ఉంటాయి. కనుక వాటన్నిటిని దృష్టిలో ఉంచుకుంటేనే గాని స్త్రీల వ్యాధులను నిర్ణయించటం వీలు కాదు.

స్త్రీ జననాంగ వ్యాధులు ముఖ్యంగా మూత్రం మంట. యోని స్రావాలు, యోనిమంట.

మూత్రం మంట తెల్లబట్ట ఉన్నవని ఓ స్త్రీ చెబితే ఇందులో ఏది కారణం అనుకోవాలి...? పరిస్థితులని, ఇతర శారీరక లక్షణాలని, పేషెంటు లైంగిక చరిత్రని, ఆమె భాగస్వామి లైంగిక చరిత్రని, నిర్ధారణ పరీక్షాల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని వ్యాధి నిర్ణయం చేయడం జరుగుతుంది..ఇందుకు డాక్టరుకు  కూడా కొంత అనుభవం కావాలి.

మూత్రం మంట అని పేషెంట్ చెప్పినప్పుడు ఆ మంట లోపలి నుంచి వస్తున్నదా...? లేక మూత్రం పోసినప్పుడు యోని పెదవుల వద్ద మంట లేస్తున్నదా అనే డాక్టర్ తెలుసుకుంటాడు. లోపలి నుంచి వస్తున్న మంటకు బ్యాక్టీరియాలు కానీ ఇతర మూత్రనాళ వ్యాధులు కానీ కారణమని ఊహిస్తాడు. అదే పైపై మంట అయితే అందుకు బీజవాహిక వ్యాధి కారణమంటాడు.మూత్రం పదే పదే పోసుకోవలసి వస్తున్నదేమో కూడా అడుగుతాడు.

ఈ సారి యోని మంట కూడా ఉంటున్నదా...?  అని అడుగుతాడు.ఎందుకంటే ఒక్కొక్కసారి బీజవాయిక వ్యాధులకు క్రీములు కూడా మూత్రం మంట కలిగిస్తాయి. యోనిమంట లేనట్లయితే అది మూత్రనాళ వ్యాధే! యూరిన్ కల్చర్ చేయిస్తే E. Coli, స్టఫి లోకాస్ లాంటి సూక్ష్మ క్రీములు ఉన్నట్టు తేలుతుంది. కొందరికి మూత్రం కల్చర్ రిపోర్టులోSterile ( వ్యాధి క్రీములేవి లేవని ) అని వస్తుంది. మైక్రోస్కోప్ లో మూత్ర పరీక్ష చేస్తే చీము కణాలు ఉంటాయి. అనగా క్లామిడీయా క్రీములు కానీ,గనేరియా క్రీములు కానీ ఉన్నట్టు అర్థం. గనేరియా కొరకు గర్భాశయ కంఠస్రావాన్ని, మూత్రనాళ శ్రావణి   పరీక్ష చేస్తే ఈ రెండింటిలో ఏది ఉన్నదో తేలిపోతుంది.

యోని మంట కూడా ఉన్నదని పేషెంట్ చెప్పిందనుకోండి ఈ సమస్యను మరో కోణంలోంచి పరిశీలించాలి.

యోని మంట అతి సామాన్యంగా కేండిడా అనే ఫంగస్ వల్ల వస్తుంది దీనికి మోనీలియా అని కూడా పేరు ఈ సూక్ష్మజీవి పేరుని బట్టే ఈ వ్యాధికి కేండి డియాసిస్ అని మోనోలియోసిస్ అనే పేరు వచ్చింది.. కేండి డియాసిస్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో ట్రైకో మోనాస్ వల్ల వచ్చే ట్రైకోమోనాయాసిస్ వ్యాధికి అంతే ప్రాముఖ్యత ఉంది.రెండు ఒకేసారి సోకటం కూడా చాలా మందిలో గమనిస్తూ ఉంటాము.

ఈ రెండు కాక గార్డెనరెల్లా సంబంధమైన మరొక వ్యాధి ఉంది.భీజవాహిక స్రావాలు ఎక్కువవటం. అవి పసుపుపచ్చగాను, ఆకుపచ్చగాను వెలువడడం. వాటిలో చీము కణాలు ఎక్కువగా ఉండడం. యోని భాగాలు దురద పెట్టడం. మంట పుట్టడం.రతి సమయములో బీజవాయిక లోని మొదటి మూడో వంతు భాగంలో మంట పుట్టడం.దుర్వాసన వీటిల్లో ఏవో ఒకటి ఈ మూడు వ్యాధులలోనూ కనిపిస్తాయి.

🌹 వీటి గురించి విపులంగా మరోసారి చర్చిద్దాం!🌹

యోని మంట ఉన్నప్పుడు దాంతోపాటు గర్భాశయ కంఠం కూడా వ్యాధికి లోనైందేమోనని డాక్టర్ గారు స్పెక్యులం సహాయంతో పరీక్షిస్తాడు. మూత్రంలో చీము కణాలు కూడా ఉన్నవేమో చూస్తాడు. చీము కణాలు లేనట్టయితే యోని మంటకు, గర్భాశయకంఠ వ్యాధికి చికిత్స చేస్తాడు. మూత్రంలో చీముకణాలు కూడా ఉన్నట్టయితే యూరిన్ కల్చర్ చేయించి దాన్ని కూడా చికిత్స చేయిస్తాడు.మూత్రంలో బ్యాక్టీరియా ఉన్నట్టు తేలితే ఆ బాక్టీరియాను నిర్మూలించడానికి చికిత్స చేస్తాడు.

సూచన :- చికిత్స పేషెంట్ ఒక్కరికే చేస్తే చాలదు.ఆమె భాగస్వామికి కూడా విధిగా చికిత్స చేయాలి లేని పక్షంలో వ్యాధి తగ్గదు.
 ఈ యొక్క విషయాన్ని ఇతరులకు షేర్ చేయగలరు.
9381490085

No comments:

Post a Comment