🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖 *"381"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"ప్రపంచం మనసులో ఉందా, మనసే ప్రపంచంలో ఉందా ?"*
**************************
*"ప్రపంచాన్ని మనసుతోనే తెలుసుకుంటాం. ఈ ప్రపంచం మన మనసులోనే ఉంది. కానీ అది నూనెలో కలవని నీళ్ళులాగా ఉంది. అద్దంలో ప్రతిబింబంలా వుంటుంది. అద్దం యొక్క గుణం దానిలో ప్రతిబింబాన్ని చూపటమే కానీ నిలుపుకోవటం కాదు. అలా నిలుపుకుంటే మనం మన లాంటి మరో వాస్తవ స్వరూపాన్ని అద్దం ద్వారా తయారు చేసుకోవచ్చు ! నీరు దిగువకు, మంటపైకి ప్రయాణిస్తాయి. అది వాటి సహజ విధానం. అలాగే మనసుకు కూడా ఒక విధానం ఉంది. ఈ ప్రాపంచిక విషయాలను తెలుసుకుని మమేకత పొందుతుందే గానీ మనసులో ఏ విషయాన్ని కూడా అది నిలుపుకోలేదు. బుద్ధిలో అనుమానం లేని దృఢమైన ఈ నిర్ణయమే జ్ఞానం అనబడుతుంది. స్టౌ మంటని పెంచితే పాలు పొంగుతాయని ఇల్లాలు ఎంత దృఢంగా విశ్వసిస్తుందో అంత దృఢమైన నిర్ణయం మన మనసు విషయంలో రావాలి. అదే జ్ఞానం. సంసారం అంటే చెడ్డదని, భగవన్నామం మంచిదని ఇప్పటికే తెలుసుకున్నాం. అందుకే మనసుతో నామాన్ని జపించాలని ప్రయత్నిస్తున్నాం. ఈ సృష్టిలో దేని గుణం దానికే ఉంది మరి !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment