*"మెదడుకు ధ్యానం బీమా"*
వయసు మీద పడుతూన్నకొద్దీ మన మెదడులోని అనుసంధాన కణజాలం క్షీణిస్తూంటుంది. దీంతో మెదడు సైజు కూడా తగ్గుతుంది. ఇది మన జ్ఞాపకశక్తి, భావోద్వేగాలను, పనుల నిర్వహణ వంటి వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుంది.
అంతమాత్రాన మరీ బెంగ పడాల్సిన పనేమీ లేదని *యూనివర్సీటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెలిన్ (UCL)* అధ్యయనం భరోసా ఇస్తోంది. ముందు నుంచే ధ్యానం చేయటం ద్వారా మేధో క్షీణతను తగ్గించుకునే అవకాశం లేకపోలేదని చెబుతోంది.
*దీర్ఘకాలంగా ధ్యానం చేసేవారి మెదడు మరింత చురుకుగా ఉంటూండటమే దీనికి నిదర్శనం.* సాధారణంగా వయస్సుతో పాటు క్షీణిస్తూ వచ్చే మెదడు కణజాలం వీరిలో అంతగా తగ్గకపోవటం గమనార్హం. వీరి శారీరక వయస్సు కన్నా మెదడు వయస్సు తక్కువగా కనపడుతోంది. ఉదా. 50 ఏళ్ళ వ్యక్తులను తీసుకుంటే - ధ్యానం చేయనివారితో పోలిస్తే ధ్యానం చేసేవారి మెదడు వయస్సు సుమారు ఏడేళ్ళు తక్కువగా ఉంటోంది. అంటే శారీరక వయస్సు 50 ఏళ్ళు అయినా మెదడు వయస్సు మాత్రం 43 ఏళ్ళే అన్నమాట. అంతేకాదు ...
50 ఏళ్ళ తర్వాత కూడా ఏటా మెదడు వయస్సు శరీర వయస్సు కన్నా ఒకటిన్నర నెలలు తక్కువగానే కనబడుతోంది.
ఇంతకీ దీనికి కారణమేంటి ?
*ఒకటి - ధ్యానం చేసేటప్పుడు కుదిరే ఏకాగ్రత మూలంగా నాడీ నిర్మాణాలు వృద్ధి చెందటం, నాడీ కణాల మధ్య అనుసంధానాల సామర్థ్యం మెరుగుపడటం.*
*రెండోది - దీర్ఘకాల ఒత్తిడి దుష్ప్రభావాల నుంచి మెదడును, నాడీవ్యవస్థను ధ్యానం కాపాడుతూండటం.*
మెదడుపై ఒత్తిడి ప్రభావం తగ్గితే వాపు ప్రక్రియ ప్రతిస్పందన కూడా తగ్గుముఖం పడుతుంది. క్రోమోజోముల వయస్సును నిర్థారించే వాటి *"టెలోమేర్"* (తోకల్లాంటివి) పొడవు తగ్గటమూ నెమ్మదిస్తుంది. ఇవన్నీ మెదడుకు త్వరగా 'వృద్ధాప్యం' ముంచుకు రాకుండా కాపాడుతున్నాయి.
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment