🔥దివ్యదృష్టి యొక్క ప్రాముఖ్యత గురించి స్వామి వారు చాలా చక్కగా వివరించారు...🔥
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
మంత్ర-తంత్ర-యోగ సాధనలలో ఏ సాధన చేసినా #సిద్ధిని పొందే దశలో సాధకుడికి లభించేది "దివ్యదృష్టి".........
సాధకుడు మొదట్లో తీవ్రమైన #ఏకాగ్రతతో తన "ధ్యేయమూర్తిని" మాత్రమే చూడగలుగుతాడు. అది దేవత ఆకారం కావచ్చు, రేఖా యంత్రాకారం కావచ్చు. లేదా వట్టి తేజఃపుంజమే కావచ్చు........ క్రమక్రమంగా #దేవతానుగ్రహం చేత తాను కోరిన వాటిని గూడ చూడగలిగే శక్తి సాధకుడికి వస్తుంది........ ఏ దేవతా మంత్రమైనా యీ స్థితికి తప్పక దారితీయాలి. ఆజ్ఞాచక్ర స్థానమైన భ్రూమధ్యంలో #మూడవకన్ను అదృశ్యరూపంగా యోగికి ఉదయిస్తుంది........
ఇంతకూ.. ఈ "దివ్యదృష్టి", ఈ "మనో-నేత్రం", ఈ "#జ్ఞానలోచనం" తెరుచుకొనే మార్గమేమిటి.......
గాలిని కుంభించి, అరిషడ్వర్గాన్ని జయించి నిశ్చల-బుద్ధితో #నాసాగ్రమును చూస్తూ ఉండాలి. అని యోగశాస్త్రములు చెపుతున్నవి........
#సిద్ధుడైన గురువు చేత మంత్రం ఉపదేశం పొంది, భ్రూమధ్యము నందు దేవతను నిలుపుకొని కనులుమూసి #జపసాధన ఏకాగ్రంగా చేస్తే, తప్పక మూడవకన్ను - ఆంతరలోచనం విచ్చుకుంటుంది......
ఈ చూచే సాధనలో మరికొన్ని కూడా ఉన్నవి. అంతర్లక్ష్యము, బహిర్-దృష్టి కలిగినది #శాంభవీముద్ర. కొందరు అలా కనులు తెరిచి ఉంటారు. బయట వస్తువును దేనినీ చూడరు. అది లక్ష్య-రహితమైన చూపులా కనిపిస్తుంది. అది శాంభవీముద్ర సాధన విశేషం......... మరికొందరు #దీపసాధన చేస్తారు. "దీపదుర్గ" వంటి మంత్రాలు కొన్ని ఉన్నవి. ఆ దీపపు వెలుగులో వారు "జీవిత-రహస్యాలు" చూస్తారు........
వీటిలో దేనికైనా "ఏకాగ్రత", "మనోనిశ్చలత", "మంత్రసిద్ధి" ముఖ్యం.......
ఒక్క పూర్వజన్మకు సంబంధించిన విషయాలే కాదు, అదృశ్య #దేవలోకములు, #త్రికాలములలోని విషయాలను, ఇహ-జన్మలోని #కష్ట_సుఖాలన్నింటికీ మూలమైన అంశాలన్నీ దివ్యదృష్టి ద్వారా తెలుసుకోవచ్చు. దిని వల్ల లోకోపకారం చేగొరుతుంది...
🌹🙏🌹
సర్వేజనాసుఖినోభవంతు
_
No comments:
Post a Comment