Saturday, November 26, 2022

తలనొప్పి త‌రుచూ వేదిస్తోందా? అయితే ఈ టిప్స్ పాటించిండి...

 *తలనొప్పి త‌రుచూ వేదిస్తోందా? అయితే ఈ టిప్స్​ పాటించిండి...*

*ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్ కారణంగా.. మనుషులు మానసికంగా, శారీరకంగా త్వరగా అలసిపోతారు. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వాటిలో ముఖ్యమైంది తలనొప్పి. దీంతో తలనొప్పి, టెన్షన్‌ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.*

*తలనొప్పి – కారణాలు*

*సమయానికి నిద్ర, భోజనం ఆలస్యమైనా, నిద్ర తక్కువైనా లేక మరీ ఎక్కువైనా.. ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ తలనొప్పి వ‌స్తుంటుంది.*

*తలనొప్పి ఎక్కువైనప్పుడు చిరాకు, కోపం ఎక్కువగా ఉండి ఏ పనిచేయడం కుదరదు. కొందరికి వాంతులవుతాయి, ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శభరించలేకపోవడం, వెలుతురును సరిగ్గా చూడలేకపడం.. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా ఉంటుంది .*

*కొన్ని కుటుంబాలలో వంశపారపర్యంగా కూడా (మైగ్రేన్) తలనొప్పి వస్తుంది. అలాగే తలలోని రక్తనాళాల్లో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడటం వలన వస్తున్నట్లు వైద్య నిపుణుల వాద‌న‌.*

*తలనొప్పి తగ్గాలంటే ఇలా చెయ్యండి*

*ఎక్కువ సమయం కంప్యూటర్, ల్యాప్ టాప్ స్క్రీన్స్ ను చూస్తుండటం వల్ల కళ్ళకు ఒత్తిడి, అలసట ఏర్పడి తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి గంటకు ఒకసారి బ్రేక్ ఇవ్వండి. అప్పుడప్పుడు కను రెప్పలను కదిలిస్తుండాలి. అదేవిధంగా ఎక్కువగా టీవీ చూడటం వల్ల కూడా కళ్ళు బాధిస్తాయి. కాబట్టి టీవీ చూడ్డానికి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయండి.*

*తలస్నానం చేసిన తర్వాత తల తడిగా ఉండడం వల్ల తలనొప్పి వస్తుంది. తలనొప్పికి ఇదొక ముఖ్య కారణం. కాబట్టి తలస్నానం చేసిన ప్రతి సారి తలను పూర్తిగా ఆరబెట్టుకోవాలి.* 

*క్రమం తప్పకుండా చేసే యోగాసనాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.*

*త‌ల‌నొప్పి వ‌చ్చిన‌ప్పుడు డార్క్‌ గ‌దిలో క‌ళ్ల‌పై త‌డి క్లాత్ వేసి గంట పాటు ప‌డుకుంటే కాస్త ఉప‌శ‌మ‌నం అవుతుంది.*

*అలాగే వేడి చేసిన పాలు తాగితే తలనొప్పి తగ్గుతుంది. తలనొప్పి తరచూ వేధిస్తుంటే భోజనంలో నెయ్యి వేసుకొని తింటే ఫలితం ఉంటుంది.*

*తలకు గోరువెచ్చ‌ని కొబ్బరి నూనెతో 10, 15 నిమిషాల పాటు మర్దనా చేసుకున్నా తలనొప్పి తగ్గిపోతుంది.*

*గోరువెచ్చ‌ని వేడి నీళ్లు నింపిన బకెట్‌లో కుర్చీలో కూర్చొని పాదాలను అర‌గంట పాటు ఉంచితే దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పి, సైనస్ వల్ల వచ్చిన తలనొప్పి తగ్గిపోతుంది.*

*కొత్తి మీర, జీలకర్ర, అల్లం కలిపి చేసిన కషాయం తాగితే తలనొప్పి తేలికగా తగ్గిపోతుంది.*                                   ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి...............info  from  🩺 Dr.Kaladhara Raju,                  
psychologist & Homoeopath,             Guntakal 🌹  if any health issues, pls contact online treatment available(9440673644)

No comments:

Post a Comment