Wednesday, December 14, 2022

BE STILL

 *BE STILL*

నువ్వు ఉండు. అంతే. I am this, I am that అనుకోకు. అలాగే I am so and so అనుకోకు. ఎలా ఉన్నావో అలా ఉండు. అది సాధించాం, ఇది సాధించాం అనుకోవడమే విషం. ఆ అనే నేనుని తొలగించు.

నీవు ఎవరికి ఏ ఉపకారం చేసినా అది అంతర్యామిగా ఉన్న నారాయణునికే అందుతుంది. నారాయణుడు అంతర్యామిగా లేకుండా ఒక్క శరీరం కూడా భూమి మీదకు రావటానికి వీలులేదు.

ఆరోగ్యం కోసం హితం చేసుకొని doctor ఇచ్చిన బిళ్ళలు చేదుగా ఉన్నా మింగుతారు కదా. అలాగే మీకు కష్టమైనా భగవంతునికి ఇష్టమైన పనులు ప్రీతిగా చేయండి. అప్పుడు ఆయన మీ క్షోభ స్వీకరించి మోక్షం ప్రసాదిస్తాడు.

గీతలో పరమాత్మ అంటాడు: ‘ఊరికే చేతులు ఆడించు. పని నాది గౌరవం నీది’. కాని మనం ఎవరో చేసిన పని కూడా నేనే చేసానంటాము. భగవంతుడు ‘పని నేనే చేస్తాను, గౌరవం నేనే ఇస్తాను’ అంటున్నాడు. అది దైవీలక్షణం.

ఆచార్యులవారు అన్నారు: ‘మొసలిని నమ్మి నదిని దాటడం ఎటువంటిదో అహంకారం కోసం బతకటం అటువంటిదే. ఎందుచేతంటే అహంకారం నిన్ను పీల్చి, పిప్పిచేసి, గుల్లచేసి వదులుతుంది’.

సత్కర్మ నిశ్శబ్దంగా చేస్తుంటే మనస్సు దేహం చుట్టూ తిరగడం మానేసి దాని స్వస్తానానికి అది వెళ్ళిపోతుంది. అంటే నీ మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంది. నీకు అంతర్ దృష్టి కలుగుతుంది.

మనం ఏ రూపాన్నైతే ఆరాధిస్తున్నామో ఆ రూపం మనల్ని అరూపానికి తీసుకుపోతుంది. అరూపమే మన రూపం.

ఇలా జరిగిందేంటి? అలా జరిగిందేంటి? అనుకుంటారు. ఆ చెడు ఒక మంచి జరగటానికే పంపిస్తాడు. The greatest thing is to stop worrying.
- Sadguru Sri Nannagaru🙏🏻

No comments:

Post a Comment