281222a1758. 291222-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀712.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*"సాధన లేక శాంతియు లేదు! శాంతి లేక సౌఖ్యము లేదు. కనుక మీరు నిజముగా సౌఖ్యముగా ఉండవలెనన్న ఆధ్యాత్మిక సాధన చేసి తీరాలి.*
*కేవలము మాసమునకు నాలుగు దినముల పాటు నాలుగు గుడులు తిరిగి దండం పెడితే సరిపోదు!*
*ఇది సాధన అనిపించుకోదు. దైవము నిత్యమూ ఉన్నాడు కనుక సాధన నిత్యమూ చేయాలి.*
*దేవుని లేని స్థలము లేదు కనుక మీరు ప్రత్యేకముగా దేవుని నిమిత్తం దేవాలయానికే వెళ్ళనవసరం లేదు. దేవుడు గుడిలో ఎలా ఉన్నాడో మీ గుండెలో కూడా అలానే ఉన్నాడు. కనుక మీరున్న చోటనే కుదురుగా కూర్చుని మీ మనో బుద్ధులను స్థిరముగా భగవంతునిపై నిలపండి.*
*తీయనైన ఆయన నామాన్ని స్మరించండి. అతి సుందరమైన ఆయన రూపాన్ని ధ్యానించండి.*
*దీనులను భగవంతుని స్వరూపులుగా భావించి సేవించండి.*
*తద్వారా మీ మనో వ్యధలన్నీ సమసిపోయి మీకు అఖండమైన మనశ్శాంతి లభిస్తుంది.*
*మీ కర్మలన్నీ కరిగిపోయి మీ జన్మలు ధన్యం అవుతాయి." *✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment