Thursday, December 29, 2022

విశ్వాసం!* ➖➖➖✍️ ---చాగంటి వారి ప్రవచనం నుండి.

 1811.  1-8.  291222-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                    *విశ్వాసం!*
                  ➖➖➖✍️
      ---చాగంటి వారి ప్రవచనం నుండి.

*విశ్వాసం గురించి రామకృష్ణ పరమహంస ఒక కథ చెపుతారు...*

*వెనుకటికి దక్షిణ సముద్రం దగ్గర ఒక భక్తుడు నిలబడి ‘ఈ సముద్రమును దాటి భారత దేశమునకు వెళ్ళాలి.’*

*’ఓడ వెళ్ళిపోయింది. ఎలా.,.. ‘అని కంగారుపడుతున్నాడు.*


*ఆ సమయంలో అటుగా ఒక సిద్ధ పురుషుడు వెళ్ళిపోతున్నాడు.*

*’ఏమి నాయనా... అలా కంగారు పడుతున్నావు...’అని అడిగాడు.*

*’అంటే ఏమి లేదండి... సముద్రం మీద ఓడ వెళ్ళిపోయింది….   ఇపుడు నేను ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. మళ్ళీ రేపటి వరకు ఓడ లేదు! అందుకని కంగారు పడుతున్నాను.’ అన్నాడు.*

*అపుడు సిద్ధుడు  ‘నీవేమి కంగారుపడకు.’ అని ఒక కాగితం మీద రాసి, మడిచి చేతిలో పేట్టి... ‘ఇది విప్పి చూడకు. చూడకుండా చేత్తో పట్టుకో. పట్టుకుని ఈ సముద్రం మీద నడిచి వెళ్ళిపో. నువ్వు వెళ్లిపోతావు. నీళ్ళల్లో పడవు. వెళ్ళు...’ అన్నాడు.*

*సిద్ధపురుషుడు అంటే మాటలు కాదు కదా..! ‘ఈయన ఇచ్చాడు కాబట్టి ఇది నన్ను రక్షించి తీరుతుంది.... నేను మునగను..’ అనుకున్నాడు.*

*అంటే ఆ నీళ్ళమీద పరుగెత్తడం మొదలుపెట్టాడు.*

*అందులో దిగిపోకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకా కొద్ది దూరంలో ఒడ్డు కనిపించింది. అపుడు ఆశ్చర్యం వేసింది.*

*ఇంతలా నన్ను నీటిమీద పరుగెట్టించిన ఈ కాగితంలో ఉన్న రహస్యం ఏమిటి..?’ అని అనుకున్నాడు.* 

*ఒకసారి ఆ కాగితంలో ఏమి రాసి ఉన్నదో చూడాలని అనుకున్నాడు.*

 *అనుకుని ఆ కాగితం విప్పాడు. ఆ కాగితంలో 'శ్రీరామ' అని రాసి ఉంది.*

*’ఈ నామమా నన్ను పరుగెత్తించింది' అన్నాడు.*

*వెంటనే మునిగిపోయాడు. విశ్వాసం పోయింది. కొట్టుకుపోయాడు.*

*విశ్వాసం ఉన్నంతసేపు వాడు మహా జ్ఞానితో సమానమై పోయాడు.*

*అందుకనే విశ్వాసం పోకుండా పరమాత్మ నామం చెప్పగలిగితే జ్ఞానితో సమానమైపోతావు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment