💖💖💖
💖💖 *"397"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"రూపనామాలు మరిచిపోతే శాంతి వస్తుంది అంటున్నారు, అవి రెండూ లేనప్పుడు ఉండేదేమిటి ?"*
*"బాహ్యలక్షణములుగా కనిపించే దేహక్రియలతో మనకు నిమిత్తంలేదు. మనలోనేవున్న సత్యం 'అదిగా స్ఫురించే వరకు' మనసు దాన్ని తెలుసుకోలేదు ! దీన్నిబట్టి మన మనోదేహాలు రెండూ నిమిత్త మాత్రమేనని అర్ధం అవుతుంది. ఈ సత్యం సంపూర్ణంగా ఆకళింపు అయితే మనం పరమశాంతితో నిశ్చలస్థితిని పొందుతాం. మనం ఏ సాధనచేసినా ఆ స్థితిని పొందేందుకే. ఆ స్థితిలో మన రూపనామముల భావన పోవటమే అప్పటి శాంతికి కారణమవుతుంది. మనం దేవుని విగ్రహం ముందు కూర్చోని పూజలు చేస్తాం. సహస్రనామాలు పఠిస్తాం. ఇదంతా మన రూపం, నామం మరిచిపోయేందుకే ! అలా మర్చిపోయిన రోజు మనంచేసే పూజలేకాదు, ప్రతిపనీ ఆరాధనతో సమానం అవుతుంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment