*🙏🏻 🪷ఓం నమో భగవతే వాసుదేవాయ 🪷🙏🏻*
*_🪷 " అధ్యాత్మిక సాధనలన్నింటిలో శరణాగతి చాలా గొప్పది. శరణాగతి భావం అనేది మిమ్మలని చాలా దైర్యవంతులుగా చేస్తుంది. ఆనాడు ' నీవు తప్ప నాకు మరో దిక్కు లేదు! ' అని ప్రార్థించిన ప్రహ్లాదుడుని, నిండు సభలో అవమానింపబడి, ' నీవే శరణు! ' అని వేడుకున్న ద్రౌపదిని, ' నేను నీకు సంపూర్ణ శరణాగతుడను, నన్ను అదేశింపుము!' అని మోకరిల్లిన అర్జునుడిని కాపాడినది శరణాగతియే! వీళ్లంతా గొప్ప గొప్ప సాధనలు ఏవీ చేయలేదు. ' కష్టమైనా, సుఖమైనా అంతా నీవే దిక్కు! ' అని దైవముపై విశ్వాసముంచి, కేవలం దైవాన్ని మాత్రమే ఆశ్రయించినారు. కనుకనే ఎంతటి కష్టమైన పరిస్థితుల్లో ఉండినా కూడా పిలవగానే వచ్చి ఆదుకున్నాడు. వారి భారమంతా తానే స్వయముగా మోసినాడు. ఇట్టి విశ్వాసము, శరణాగతి కొరకు మీరు నేడు సాధన చేయాలి తప్ప ఏవేవో కోరికలు కోసం కాకూడదు. ఇట్టి భావం మీలో ఉంటే మీరు దేని నిమిత్తమూ చింతించవలసిన పని ఉండదు. అన్నీ తానై మిమ్మలిని చూసుకుంటాడు. మీకోసం ఏది చేయడానికైనా సిద్ధపడి ఉంటాడు."🪷*
No comments:
Post a Comment