Friday, December 23, 2022

****:::::లోపలి మాటలు :::::

 *:::::::లోపలి మాటలు ::::::*

    మన మనస్సు లో నుండి మనకు రెండు రకాల మాటలు విని పడతాయి.
  *1) ఏవేవో ఆలోచనలు...*
             ఇవి మనతో మనం మాట్లాడుకునే మాటలు.
వీటికి విలువ లేదు. పైగా వీటినుండి బయట పడదాము అనుకుంటాం. లోపలి ఈ మాటలు ఆగి నిశబ్దం వుంటే బాగుండు అనుకుంటాం.
*2) పరిష్కారం..*.
     మనం ఒక సమస్య లో వున్నపుడు, ఎటూ తేల్చుకోలేక పోతున్నప్పుడు , నిర్ణయం చేయలేక సందిగ్ధత వున్నప్పుడు,  శూన్యత ఏర్పడి, అకస్మాత్తుగా లోపలినుండి మొరుపు లాగా ఒక పరిష్కారం,ఒక నిర్ణయం,ఒక జవాబు,ఒక క్లారిటీ, వస్తుంది.
    దీనికి ఏదేదో పేరు పెడతారు. గురువు మెసేజ్ అంటారు, విశ్వం ఇచ్చిన జవాబు అంటారు.
     *నేనైతే దీనిని ప్రజ్ఞ అంటాను. సరైన ధ్యానికి త్వరగా ప్రజ్ఞ మేల్కొని వుంటుంది*

*షణ్ముఖానంద. 9866699774*

No comments:

Post a Comment